ప్రముఖు టాలీవుడ్ స్టార్‌ దర్శకుడు అనిల్ రావిపూడి ప్రెసెంట్ అగ్ర సీనియర్ హీరోలతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు .. అందులో భాగంగానే బాలకృష్ణతో భగవంత్‌ కేసరి సినిమా చేసిన అనిల్ రావిపూడి.. ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో కలిసి సంక్రాంతికి వస్తున్నామం అనే సినిమా చేశారు.. ఇక గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2 , ఎఫ్3 సినిమాలు కూడా మంచి విజయాలు అందుకున్నాయి .. ఇక ఈ సంక్రాంతికి వస్తున్నాం సినిమా 2025 సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రేక్షకులు ముందుకు రానుంది .. ఇప్పటికే ఈ ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్ , సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి .. దాంతో సినిమాపై పాజిటివ్ టాక్ వినిపిస్తుంది .. ఇప్పుడు అనిల్ రావిపూడి చూపు మరో ఇద్దరు సీనియర్ హీరోలపై పడిందని తెలుస్తుంది .. ఇంతకీ వారు మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి , కింగ్ నాగార్జున.


అసలు మేటర్ లోకి వెళితే .. మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయడానికి ఎప్పటినుంచో ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే .. అయితే ఈ సినిమా చిరంజీవి 156 అవుతుందా లేక 157 అవుతుందో అన్నది కాలమే చెప్పాలి. ప్రస్తుతం ఈ సినిమా ప్లానింగ్ జరుగుతుంటే వచ్చే సంవత్సరం ఈ సినిమాని పట్టాలింకించబోతున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమా కథ విషయంలో అనిల్ ఒక ఎవరు ఊహించని పాయింట్ తీసుకున్నట్టు తెలుస్తుంది .. ఇక ఈ కథను చిరంజీవి - నాగార్జున ఇద్దరితో కలిసి చేయాలని ప్లాన్ చేస్తున్నారట .. ఇక అందులో భాగంగా స్టోరీలో కొన్ని మార్పులు చేసి మల్టీస్టారర్ మూవీగా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది.


ఒకవేళ ఇదే నిజమైతే అటు చిరంజీవి ఇటు నాగార్జున అభిమానులకు పండగే అని చెప్పొచ్చు.. అంతేకాకుండా వీరిద్దరిని ఒకే సినిమాలో చూడాలని అభిమానులు కూడా ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు .. దాంతో అనిల్ రావిపూడి రూపంలో వారి అభిమానుల  కోరిక కూడా నెరవేరుతుంది .. అంతేకాకుండా ఇది నిజమైతే ఇండస్ట్రీకి నాలుగు దిగ్గజాలైన వెంకటేష్ , చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జునలతో అనిల్ రావిపూడి సినిమాలు చేసినట్టు అవుతుంది. అయితే ఒక సినిమాలో ఒకేసారి ఇద్ద‌రు హీరోలను ఎలా డీల్ చేయాలో అనిల్ రావిపూడికి బాగా తెలుసు .. ఇప్పటికే ఎఫ్2 , ఎఫ్3 సినిమాలతో వెంకటేష్ , వరుణ్ తేజ్ కాంబోలో వచ్చి రెండు కూడా బంపర్ హిట్ సాధించాయి. అలాగే ఈ రెండు సినిమాలు కూడా కామెడీ నేపథ్యంలో వచ్చినవే. అయితే ఇప్పుడు ఇద్దరు సీనియర్ అగ్ర హీరోలతో అనిల్ రావిపూడి ఒక కథను ఎలా డీల్ చేస్తారు అని సినీ ప్రముఖులు కూడా ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు .. ఇక మరి అనిల్ ప్లానింగ్ ఎలా ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: