బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ నిఖిల్ మాలియక్కల్ తల్లి సులేఖ, కావ్య శ్రీ షాక్ ఇచ్చింది. ఇటీవల మా టీవీలో వచ్చే ఓ షోలో నిఖిల్, కావ్య ఎదురుపడ్డారు. ఆ షోకి శ్రీముఖి కి యాంకర్ అవ్వడంతో పలు విధాలుగా కావ్యని, నిఖిల్ ని కలపడానికి ప్రయతించినప్పటికి  కావ్య నిఖిల్ తో వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అంతే కాకుండా తాను నిఖిల్ గురించి మాట్లాడిన ప్రతిసారి చాలా కోపంగా చూసింది. దీంతో ఈ షోలో అందమైన అమ్మాయి ఎవరు అని శ్రీముఖి నిఖిల్ ని అడిగినప్పుడు కూడా నిఖిల్ కావ్య పేరు చెప్పలేదు. అందరూ కావ్య పేరే చెప్తాడు అనుకున్నారు కానీ నిఖిల్ మాత్రం ప్రియాంక బ్యూటిఫుల్ అమ్మాయి అని చెప్పాడు.
అయితే ఇదిలా ఉండగా.. స్టార్ మా పరివారం కార్యక్రమంలోకి నిఖిల్ తల్లి సులేఖ ఎంట్రీ ఇచ్చింది. అయితే సులేఖ స్టేజ్ పైనకి ఎంట్రీ ఇవ్వగానే.. కావ్య అక్కడినుండి వెళ్లిపోయింది. సులేఖ స్టేజ్ పైనకి రాగానే నిఖిల్ ఎమోషనల్‌ అయ్యాడు. ఆ తర్వాత నిఖిల్ తన తల్లికి ఐదు సర్ ప్రైజ్‌లు ఇచ్చాడు. సొంత ఇల్లులేదని తన తల్లికోసం డ్రీమ్ హోమ్ కట్టిస్తున్నాని చెప్పాడు. అలాగే సినిమా డేట్, డిన్నర్ డేట్, ఇంటర్నేషనల్ ట్రిప్, పేరెంట్స్ ఇద్దరికీ డెస్టినేషన్ ట్రిప్ అంటూ ఐదు సర్ ప్రైజ్‌లు ఇచ్చాడు. అనంతరం సులేఖ
మాట్లాడుతూ.. రెండేళ్లలో నిఖిల్ పెళ్లి అయిపోతుందని.. మీకు ప్రామిస్ చేస్తున్నాను అని చెప్పుకొచ్చింది. దానికి నిఖిల్ కూడా థాంక్యూ అమ్మ అనేశాడు. ఇక ఫాన్స్ అందరూ పాపం కావ్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక నిఖిల్ హీరోగా నటించిన గోరింటాకు సీరియల్ లో హీరోయిన్ రోల్ లో కావ్య శ్రీ నటించింది. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో కూడా ఉన్నారు. అయితే నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు వారికి గొడవ అయిందని సమాచారం. నిఖిల్ బిగ్ బాస్ కి వెళ్లక బయట నాకు వేరే ఉన్నారని.. బ్రేకప్ అయిందని నిఖిల్ అన్నాడు. బిగ్ బాస్ నుండి బయటికి వెళ్లిన తర్వాత తనని కలుస్తానని, తనపై ఉన్న ప్రేమని మళ్లీ వ్యక్తపరుస్తానని ఎమోషనల్ అయ్యాడు. కానీ నిఖిల్ హౌస్ నుండి బయటికి వచ్చి రోజులు గడిచాయి కానీ తాను కావ్య శ్రీ కలవడానికి వెళ్లలేదు అని తెలిసిందే.
   





మరింత సమాచారం తెలుసుకోండి: