ఇక ఈ 2025 సంక్రాంతికి ఎవరికి  ఎలా ఉన్నా కూడా విక్టరీ వెంకటేష్ కు మాత్రం ఫైనల్ ఎగ్జామ్ లాగా మారింది .. 2024 సంక్రాంతికి వెంకటేష్‌కు సరైన హిట్‌ లభించలేదు .. యాక్షన్ విత్ ఫ్యామిలీ  టచ్ అనే జానర్‌లో సైంధవ్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. ఈ సినిమా కథ బాలేదా , సినిమానే బాలేదు అన్నది పక్కన పెడితే మినిమం ఓపెనింగ్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర చూపించలేదు .. ఫలితంగా డిజాస్టర్ గా మిగిలింది. ఇక‌ ఇప్పుడు 2025 సంక్రాంతికి కూడా సంక్రాంతికి వస్తున్నామం అనే సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు వెంకటేష్ .. ప్రజెంట్ మారుతున్న యూత్ అభిరుచుల ప్రకారం సినిమాలకు ఆదరణ మారుతుంది ..


సీనియర్ హీరోల్లో మెగాస్టార్ మరియు బాలకృష్ణ త‌ప్పితే మరెవరికి సరైన విజయాలు రావడం లేదు. ఇక సంక్రాంతికి రెండుసార్లు ఫ్యామిలీ ఫ‌న్ సినిమాలతో వచ్చి నాగార్జున మంచి విజయాలు అందుకున్నారు.. అంతమాత్రాన నాగ్‌ ట్రాక్ అద్భుతంగా ఉందని చెప్పడానిక లేదు .. అలాగే రవితేజ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు .. నిర్మాతలు ఊహించిన విధంగా పాతాళానికి వెళ్ళిపోతున్నారు .. చిరంజీవి - బాలకృష్ణ లు కొంచెం బెటర్ పొజిషన్లో ఉన్నారు .. ఇప్పుడు ఇంతకీ విక్టరీ వెంకటేష్ పరిస్థితి ఏమిటి అన్నది ఇంకా క్లారిటీ రావాలి. గతంలో ఎఫ్2 , ఎఫ్3 సినిమాలతో విజయాలు, ఫ్యామిలీ సబ్జెక్ట్ పైగా యంగ్ హీరో వరుణ్ తేజ్ తోడుగా ఉన్నారు ..


అయితే 2024 లో యాక్షన్ జానర్ ఫెయిల్ .. ఈ 2025లో మళ్ళీ ఫ్యామిలీ జాన‌ర్ కు వచ్చారు. యంగ్ హీరో తోడు లేదు సోలోగా ఇద్దరు హీరోయిన్లతో ట్రై చేస్తున్నారు. ఇది సక్సెస్ అయితే సీనియర్ హీరోగా వెంకటేష్ కు ఓ క్లారిటీ వచ్చేసింది. తాను ఎలా ముందుకు వెళ్లాలో కూడా.. లేదు ఇది కూడా తేడా చేస్తే ఇక ప్రస్తుతానితంగా కెరీర్ ను నిలిపే అవకాశం కూడా ఉంది .. ఫ్యామిలీస్ సబ్జెక్ట్ అనిల్ రావిపూడి హ్యాట్రిక్ కాంబినేషన్ పాటలు హిట్ సంక్రాంతి సీజన్ ఇప్పుడు కూడా పుల్లింగ్ లేకపోతే వెంకటేష్ సినిమాలు మానేయటం బెటర్ అని కూడా అంటారు. మరి ఈ సంక్రాంతికి వెంకీ మామ ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: