ప్రభాస్ ..ఆరడుగుల అందగాడు. ఆ కటౌట్ చూస్తే సినిమాలు తీసేయాలి అని.. ఆ కటౌట్ చూస్తే ఇంకా ఏవేవో చేసేయాలని అనిపిస్తూ ఉంటుంది అంటూ ఉంటారు జనాలు . మరీ ముఖ్యంగా ఆయన ఫ్యాన్స్ . ప్రభాస్ ఎంత మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అనేది అందరికీ తెలిసిందే . మిగతా హీరోల ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ..బయట కొట్టుకొని చచ్చిపోతూ ఉంటారు . అరుచుకుంటూ ఉంటారు . నానా రాద్ధాంతం చేస్తూ ఉంటారు . కానీ ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం అలా కాదు . చాలా జెన్యూన్ . చాలా నిజాయితీగా ఉంటారు.  తమ హీరో సినిమా రిలీజ్ అవుతుందా..? తమ హీరో సినిమా హిట్ అవ్వడానికి ట్రై చేస్తారు.


అంతేకానీ పక్క హీరోల సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి ..పక్క హీరోల ఫ్యాన్స్ బాధపడడానికి ఎప్పుడూ కూడా సహకరించరు . అలాంటి పనులు చేయరు . అందుకే ఇండస్ట్రీలో రెబెల్ హీరో ప్రభాస్ కి స్పెషల్ స్థానం కూడా ఉంది .అయితే ప్రభాస్ చాలా చాలా సైలెంట్ పర్సన్ . తన చుట్టూ ఉన్న నలుగురితోనూ ఆయన బాగా మింగిల్ అవుతూ ఉంటాడు . పక్క వ్యక్తులు వస్తే మాత్రం సైలెంట్ . ఎంత పెద్ద సినిమా చేసిన సరే స్టేజ్ పైకి వచ్చి మైకు ఇస్తే మాత్రం చిన్నపిల్లాడిలా ముడుచుకునేస్తాడు ..భయపడిపోతాడు.


ఇప్పుడు మాట్లాడాలా..? అంటూ అటూ ఇటూ చూస్తాడు . అలాంటి వీడియోస్ ఎన్నో బయటపడ్డాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రభాస్ కి సంబంధించిన టాటూ విషయం బాగా ట్రెండ్ అవుతుంది. ప్రభాస్ తన ఒంటిపై ఒకే ఒక్క టాటూ వేయించుకున్నాడట. అది కూడా "రాఘవేంద్ర" సినిమా కోసం అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది. ఆ సినిమా కధా.. కంటెంట్ ప్రకారం స్క్రిప్ట్ లో భాగంగా "ఓం" అనే టాటూ ప్రభాస్ తన ఛాతిపై వేయించుకున్నాడట .


కానీ ఆ తర్వాత ఆ సీన్స్ సినిమాలో నుంచి లేపేయడంతో "ఓం" అనే టాటూ బయటికి రాకుండా పోయింది. ఆ తర్వాత చాలా సందర్భాలలో .. ప్రభాస్ నటించిన సినిమాలల్లో "ఓం"  అనే టాటూ ఎక్స్పోజ్ అవ్వకుండా కొన్ని క్రీమ్స్ తో కవర్ చేస్తూ వచ్చాడట. ఎందుకో ప్రభాస్ కి మొదటి నుంచి టాటూస్ అంటే పడవు ..ఇష్టం లేదు. కానీ సినిమా కోసం అలా చేశాడట . ఆ తర్వాత దాన్ని ఏమి చేయలేక అలాగే క్రీమ్స్ తో కవర్ చేస్తూ వస్తున్నాడట . ప్రభాస్ ఏ పని చేసిన సరే చాలా తెలివిగా చేస్తాడు అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: