టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఏ మాయ చేసావే సినిమాతో టాలీవుడ్ చిత్రపరిశ్రమకు పరిచయమైన ఈ చిన్నది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఏమాయ చేసావే సినిమాలో తన అమాయకమైన నటన, అందం, వాయిస్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సినిమా అనంతరం వరుస పెట్టి ఎన్నో సినిమాలలో నటించి అగ్ర హీరోయిన్గా రాణించింది. దాదాపు పదేళ్లపాటు ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా తన హవాను కొనసాగించింది.

స్టార్ అగ్ర హీరోల అందరి సరసన హీరోయిన్గా నటించి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంది. యంగ్ హీరోల నుంచి సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా అందరితోనూ ఆడి పాడింది. ప్రస్తుతం సమంత తెలుగులో సినిమాలు చేయడానికి పెద్దగా ఆసక్తిని చూపించడం లేదు. తన పూర్తి ధ్యాస బాలీవుడ్ ఇండస్ట్రీ వైపు పెట్టింది. వెబ్ సిరీస్ లలో నటిస్తోంది. తాజాగా సిటాడేల్ రీమేక్ సిరీస్ హనీ బన్నీలో నటించింది. 2024 నవంబర్ 7వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా సమంత మరో వెబ్ సిరీస్ కు సమంత ఓకే చెప్పినట్లు వినిపిస్తోంది.

హనీ బన్నీకి ఫ్యామిలీ మ్యాన్ డైరెక్టర్లు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహించారు. ఈ సిరీస్ లో సమంత, వరుణ్ ధావన్ కలిసి జంటగా నటించారు. ఇందులో సమంత బోల్డ్ సీన్లలో ఎక్కువగా నటించింది. లిప్ లాక్ సన్నివేశాలు, బోల్డ్ సీన్లు ఉండడంతో నెటిజెన్లు పలు రకాలుగా స్పందించారు. ఈ తరహాలో నటించడం అవసరమా అని ప్రశ్నించారు. శృంగారానికి సంబంధించిన సన్నివేశాలలో సమంత నటిస్తున్న తీరును చూస్తుంటే ప్రతి ఒక్కరికి సమంతపై చాలా కోపం వచ్చింది. చైతుపై ఉన్న కోపం కారణంగానే సమంత ఆ కోపాన్ని, ఆ కసిని ఇలాంటి సన్నివేశాలలో నటించడానికి ఉపయోగించుకుందని కొంతమంది కామెంట్లు చేశారు.

కాగా, సమంత 2024లో ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. సమంత తెలుగులో సినిమాలు చేయడానికి చేయాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాను తెలుగులో నటించకపోవడానికి గల ప్రధాన కారణం తన భర్త నాగచైతన్య. తనతో విడాకుల కారణంగానే సమంత తెలుగులో సినిమాలు చేయడం లేదని సమాచారం అందుతుంది. ఇక నాగచైతన్య రెండో పెళ్లి చేసుకొని సమంతకు గట్టి షాక్ ఇచ్చాడు. మరి నాగచైతన్యపై ప్రతీకారం తీర్చుకోవడానికి సమంత మరో పెళ్లి చేసుకుంటుందా లేదా అని చాలామందికి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: