నందమూరి బాలయ్య నటిస్తున్న డాకు మహారాజ్ విశేషాలు గురించి జనాలకు చెప్పాల్సిన పనిలేదు. గత కొన్ని సంవత్సరాలుగా వరుస విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రంగా ‘డాకు మహారాజ్’ని బాబీ దర్శకత్వంలో చేస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక ఈ సినిమాలో బాలకృష్ణను మునుపెన్నడూ చూడని కొత్త అవతారంలో దర్శకుడు బాబీ చూపించడంతో నందమూరి అభిమానులు పిచ్చెక్కిపోతున్నారని చెప్పుకోవచ్చు. ఇటీవల రిలీజ్ అయిన ‘డాకు మహారాజ్’ టైటిల్ గ్లిమ్స్ దానికి ఉదాహరణంగా చెప్పుకోవచ్చు.

ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుండడంతో బాలీవుడ్లో కూడా ఈ సినిమాకి మంచి హైప్ వచ్చింది. ఇక ఈ సినిమాలో శ్రద్దా శ్రీనాధ్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి అందరికీ తెలిసినదే. ఇక అసలు విషయంలోకి  వెళితే... ఈ చిత్ర నిర్మాత అయినటువంటి నాగ వంశి తాజాగా నందమూరి అభిమానులకు ఓ శుభవార్తని చెప్పుకొచ్చాడు. దాంతో సోషల్ మీడియా వేదికగా జనాలు ఆ విషయాన్ని షేర్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. విషయం ఏమిటంటే... నిర్మగా నాగ వంశి సోషల్ మీడియా వేదికగా పోస్టు పెడుతూ... సంగీత దర్శకుడు థమన్ ‘డాకు మహారాజ్’ సినిమా బాక్గ్రౌండ్ స్కోర్ ఇరగదీసేసాడని, మునుపెన్నడూ లేని విధంగా.. న భూతొ న భవిష్యతి అన్నరీతిలో సంగీతం కొట్టాడని చెప్పుకొచ్చాడు. దాంతో సంక్రాతి పండగ సందర్భంగా అభిమానులకు పూనకాలు ఖాయం అంటూ రాసుకొచ్చాడు. దాంతో అభిమానులు నిజంగానే పండగ చేసుకుంటున్నారు.

ఇక మరో విషయం ఏమిటంటే... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను భారిగా ప్లాన్ చేసాడు నిర్మాత నాగవంశీ. రానున్న నూతన నూతన సంవత్సరం జనవరి 4న USAలోని డల్లాస్, టెక్సాస్ లో సాయంత్రం 6.00 ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. దానికోసం భారీ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోవైపు బాలయ్య తన అభిమాన హీరో కాబట్టి ఈ ఫంక్షన్ ను అందరూ చాలా కాలం మాట్లాడుకునేలా గ్రాండ్ గా చేయాలని నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు అని చాలామంది చెప్పుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: