2024 సంవత్సరంలో బాక్స్ ఆఫీస్ ముందుకు ఎన్నో సినిమాలు వచ్చాయి .. అయితే వాటిలో తెలంగాణ నేప‌థ్యం ఉన్న సినిమాలు ప్రేక్షకులను ఎంతగానో ఆలరించాయి .. స్టార్ హీరోల నుంచి ఊహించని విజయాలు వరకు వైవిద్య భరితమైన చిత్రాలను ప్రేక్షకుల ఎంతగానో ఆదరించారు .. కొన్ని సినిమాలు అంచనాలు అందుకోవటంలో బోల్తా కొట్టాయి .. మరికొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచి అందరినీ ఆకర్షించాయి .. ఇక 2024 లో తెలంగాణ యాస‌లో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాలు అందుకున్న సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం. తెలుగు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ హీరోగా వ‌చ్చిన టిల్లు స్వ్కేర్   బాక్సాఫీస్ వద్ద వందకోట్ల కలెక్షన్ రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది .. ఇక ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటించింది అలాగే హైదరాబాద్ సంస్థానంలో 1940 లలో తెలంగాణ ప్రాంతంలో రజాకార వ్యవస్థపై జరిగిన అరాచకాలు మీద వచ్చిన మూవీ రజాకర్ మొదటి రోజు నుంచి మంచి టాక్ రావడంతో అదిరిపోయే కలెక్షన్లు తెచ్చుకుంది..


ఆ తర్వాత రీసెంట్గా తెలంగాణ పెళ్లి నేపథ్యంలో వచ్చిన మరో మూవీ లగ్గం థియేటర్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్గా నిలిచింది  .. అలాగే అనన్య నాగళ్ల‌ ప్రధాన పాత్రలో నటించిన మరో డిఫరెంట్ మూవీ పొట్టేల్‌ ఈ సినిమా కూడా ప్రేక్షకుల దగ్గర్నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అంతేకాకుండా జితేందర్ రెడ్డి , ఊరుకు పట్టేలా , లైన్ మాన్ , ప్రవీణ్ ఐపిఎస్ , కళ్ళు కాంపౌండ్  ,పైలం పిల్లగా , షరతులు వర్తిస్తాయి , గొర్రె పురాణం , బహిర్ భూమి, కేశవ చంద్ర ర‌మావ‌త్  ఇలా ఎన్నో వివిధ భరితమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి .. అయితే ఈ సినిమాలు ఆశించిన ఫలితాలు అందుకోలేకపోయాయి .. ఇన్ని సినిమాలు తెలంగాణ నేపథ్యంలో వచ్చిన కథాకథనాలు రొటీన్ గా ఉండటం మేకింగ్ నాశరకంగా ఉండటం కారణంగా చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి.


అయితే ఓటిటి లోను తెలంగాణ నేపథ్యంలో వచ్చిన సినిమాలు మంచి ఆదరణ తెచ్చుకున్నాయి .. తెలుగు స్టార్ సింగర్ సునీత కొడుకు హీరోగా దర్శకేంద్రుడి కే రాఘవేంద్రరావు గారి సమర్పణలు వచ్చిన సర్కారీ నౌకరి ఓటీటీలో ప్రేక్షకులను బాగా మెప్పించింది .. అలాగే థియేటర్లో హిట్ టాక్ తో ఓటీటీలోకి వచ్చిన లగ్గం సినిమా ఆహా , అమెజాన్ లో స్టీరింగ్ అవుతుంది. అటు తెలుగులో మాత్రమే కాకుండా తమిళం , కన్నడ , మలయాళం , హిందీ భాషల్లో సూపర్ హిట్గా నిలిచిన పెద్ద హీరో చిన్న హీరోనే తేడా లేకుండా కంటెంట్ బాగుంటే  మంచి సక్సెస్ లు తెచ్చుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: