గత కొన్ని రోజుల నుంచి ఈ సినిమా కోసం మహేష్ బాబు ట్రైనింగ్ కూడా తీసుకుంటున్నారట. అంతే కాకుండా తన లుక్, మేకోవర్ పూర్తిగా మార్చేసారని తెలుస్తోంది. ఎస్ఎస్ఎంబి 29 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి కొన్ని అప్డేట్లు ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారుతోంది.
ఈ సినిమాలో ఇండోనేషియా నటి చల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా మరో నటి పేరు కూడా తెరపైకి వచ్చింది. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. కాగా, ఎస్ ఎస్ ఎం బి 29 సినిమాకు సంబంధించి కొన్ని కీలక సన్నివేశాలను ఆంధ్రప్రదేశ్లోని బోర్ర గుహల్లో తీయాలని రాజమౌళి అనుకుంటున్నట్లుగా టాక్ వినిపిస్తోంది.
ఈ మేరకు రాజమౌళి చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి గుహల్ని పర్యవేక్షించారు. అధిక శాతం టాకీ పాట్ ను ఆఫ్రికా అడవుల్లోనే షూట్ చేయనున్నారట. ఈ సినిమా షూటింగ్ 2025 సమ్మర్ సెలవులలో ప్రారంభించే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది. అంతేకాకుండా ఈ సినిమాలో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. దీంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరుగుతున్నాయి.