గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం "గేమ్ చేంజర్". ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. అంతేకాకుండా అంజలీ, శ్రీకాంత్ వంటి నటిమనులు కీలకపాత్రలను పోషించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జి స్టూడియోస్, సంస్థ నిర్మిస్తున్నారు. దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. 

2025 జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా గేమ్ చేంజర్ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. ఈ తరుణంలోనే విజయవాడలోని బృందావన కాలనీలోని వజ్రా మైదానంలో రామ్ చరణ్ 256 అడుగులతో ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ భారీ కటౌట్ ను నిర్మించారు. ఈ కటౌట్ ఎంతో ఆకర్షణగా నిలుస్తోంది. అయితే ఇంతకన్నా ముందే 80వ దశకంలోనే దేశంలోనే అతిపెద్ద భారీ కటౌట్ ఏర్పాటు చేసి బెజవాడ వార్తలలో నిలిచిన సంగతి తెలిసిందే.


సినిమాలన్నా, అభిమానులు అన్న విజయవాడ వాసులు ప్రాణాలు ఇస్తారు. 1986లో నందమూరి బాలకృష్ణ నటించిన దేశోద్ధారకుడు సినిమా విడుదల సందర్భంగా 108 అడుగుల భారీ కటౌట్ ఏర్పాటు చేశారు. అలంకార థియేటర్ వద్ద ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ భారీ కటౌట్ చూడడానికి ప్రజలు భారీ ఎత్తున తరలి వచ్చేవారు. ఆ రోజుల్లోనే రూ. 80,000తో ఈ కటౌట్ ను ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతిపెద్ద కటౌట్ గా రికార్డు క్రియేట్ చేసింది.

ఇప్పుడు ఏర్పాటు చేసిన గేమ్ చేంజర్ కటౌట్ వరకు ముందు వరకు బాలకృష్ణ కటౌటే అతి పెద్దగా రికార్డు ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సాధించింది. దీంతో బాలయ్య రికార్డును రామ్ చరణ్ చెరిపి వేశాడు. ఇప్పుడు అతి పెద్ద కటౌట్ గా రామ్ చరణ్ ది నిలవడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. దీంతో రామ్ చరణ్ అభిమానులు సంబరాలు జరుపుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: