అయితే తాజాగా సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై పవన్ కళ్యాణ్ కొన్ని కామెంట్లు చేశాడు. ఆ కామెంట్లపై నటి కస్తూరి స్పందించింది. "పెద్దరికం అంటే పవన్ కళ్యాణ్ దే. చాలా మెచ్యూరిటీగా, ఎంతో హుందాగా మాట్లాడుతున్నారు. ఎలాంటి పక్షపాతం లేకుండా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నారు. మనమందరం ఈ అల్లకల్లోలమైన విషాదాన్ని వదిలేసి వినయంగా 2025లోకి అడుగుపెడదాం" అని రాసుకొచ్చింది సీనియర్ నటి కస్తూరి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కొన్ని ఆసక్తికర కామెంట్లను సైతం ఆమె షేర్ చేసుకుంది. ఇదిలా ఉండగా.... సీఎం రేవంత్ రెడ్డి పేరు చెప్పలేదని అందువల్లనే అల్లు అర్జున్ ను అరెస్టు చేశారని అనుకోవడం సరికాదు అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కళ్యాణ్ చెప్పాడు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్న అలానే అరెస్టు చేస్తారంటూ చెప్పుకొచ్చాడు.
చట్టం ఎవరికీ చుట్టం కాదు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నాడు. పుష్ప బెనిఫిట్ షోలకు టికెట్ల రేటు పెంచడం కూడా సినీ పరిశ్రమను ప్రోత్సాహించడమే అవుతుందని, అందుకు రేవంత్ రెడ్డి చాలా సహకరించారంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇది ఇలా ఉండగా.... రేవతి మరణం కేసులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.