
ఈ సినిమా తో పాటు మరో సినిమాకు కూడా సుకుమార్ దర్శకత్వం చెయ్యనున్నారని టాక్.. RC 16, 17 రెండు సినిమాలు కూడా సుకుమార్ చేస్తున్నట్టే లెక్క. సుకుమార్ తో రాంచరణ్ రంగస్థలం సినిమా చేశాడు. చరణ్ ని అప్పటివరకు అందరు ఒకలా చూపిస్తే సుకుమార్ మరోలా చూపించాడు. రంగస్థలం నుంచే రామ్ చరణ్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది.. ట్రిపుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ కమిట్మెంట్స్ ఎలా ఉంటాయో అందరికి తెలిసిందే. రెండు సినిమాలు సుకుమార్ లాంటి డైరెక్టర్ సమక్షంలో రావడం మెగా ఫ్యాన్స్ ని కూడా ఖుషి చేస్తుంది. ఏది ఏమైనా చరణ్ రాబోతున్న సినిమాలు ఫ్యాన్స్ కి ఫుల్ ఫీస్ట్ అందించేలా ఉంటాయని చెప్పొచ్చు. బుచ్చి బాబు డైరెక్షన్ లో సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని తెలుస్తుండగా సుకుమార్ చరణ్ కాంబో మూవీ కూడా వేరే లెవెల్ లో ఉంటుందని ఇండస్ట్రీలో టాక్.. మరి ఈ రెండు సినిమాలు ఎలాంటి రికార్డులను బ్రేక్ చేస్తుందో చూడాలి.