సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో పోలీసులు ఇటీవల అల్లు అర్జున్ ను అరెస్ట్ చేసి బెయిల్ పై విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో మహిళ మృతి కేసులో సినీనటుడు అల్లు అర్జున్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది.బెయిల్ ఇవ్వొద్దంటూ చిక్కడపల్లి పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు.అల్లు అర్జున్ తరుఫున న్యాయవాదులు బెయిల్ మంజూరు చేయాలంటూ వాదనలు వినిపించారు. ఇరు పక్షాల వాదనలను విన్న కోర్టు తీర్పును జనవరి 3కి వాయిదా వేసింది. ఇదిలావుండగా అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోర్టును ఆశ్రయించడం జరిగింది.అల్లుఅర్జున్ కి పోలీసులు భారీ షాక్ ఇచ్చారు. తాజాగా అల్లు అర్జున్ కు బెయిల్ ఇవ్వద్దు అంటూ నాంపల్లి కోర్టును తెలంగాణ పోలీసులు కోరారు. పుష్ప 2 సినిమా సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళా చనిపోవడం తో పోలీసులు అల్లు అర్జున్ ను అరెస్టు చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే అరెస్టు అయిన మరుసటి రోజున తిరిగి బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఈ విషయంపైనే తాజాగా పోలీసులు అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వద్దంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.అల్లు అర్జున్ బాగా డబ్బు ఉన్న వ్యక్తితో పాటుగా పలుకుబడి ఎక్కువగా ఉన్న వ్యక్తి కాబట్టి రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దంటూ కోర్టుని కోరారు. దీని కారణంగా సాక్షులను అల్లు అర్జున్ ప్రభావితం చేసేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇలా చెప్తున్నామంటూ పోలీసులు చెప్పుకొచ్చారు. మా కస్టడీలోనే పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణకు సరిగా సహకరించలేదు, మళ్లీ ఇప్పుడు బెయిల్ ఇస్తే మా విచారణకు అసలు సహకరించకపోవచ్చు అని తెలిపారు.ఈ విషయంపై పోలీసులు ఇంకా దర్యాప్తులు కొనసాగిస్తూనే ఉన్నామని కోర్టుకు తెలిపారు. అయితే పుష్ప సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి అల్లు అర్జున్కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. సినిమా భారీగా సక్సెస్ అయినా కూడా అల్లు అర్జున్ కు ఇలాంటి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అల్లు అర్జున్ విషయంపై అసెంబ్లీలో కూడా చర్చలు జరిగిన విషయం మనందరికీ తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: