టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంతోమంది హీరోయిన్లుగా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. అలాంటి హీరోయిన్లలో మమితా బైజు ఒకరు. ప్రేమలు సినిమాతో రేణు రాయ్ అని మెచ్యూర్డ్ విమెన్ పాత్రలో ఈ కేరళ కుట్టి తన నటనతో ఆకట్టుకుంది. ఈ సినిమాలో ఆమె నటనకు కుర్రాళ్ళు అంతా ఫిదా అయ్యారు. ఈ క్రేజీ భామ కేరళలోని కొట్టాయంలో జన్మించింది. 2017 లో "సర్వోపరి పాలక్కరణ్" సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 


ఆ తర్వాత డాకిని, కృష్షం, స్కూల్ డైరీ, వికృతి, ది ఇంటర్నేషనల్ లోక్ స్టోరీ, హనీ బి, ఆపరేషన్ జావా, సూపర్ శరణ్య, కిలోమీటర్స్ అండ్ కిలోమీటర్స్ లాంటి ఎన్నో సినిమాలలో నటించింది. ప్రేమలు సినిమా ఆమె కెరీర్ ను పూర్తిగా మార్చేసిందని చెప్పవచ్చు. కాగా, ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో విజయ్ దేవరకొండ సరసన ఓ సినిమాలో నటించబోతున్నట్లు సమాచారం అందుతుంది. అయితే షూటింగ్ లో మమితను దర్శకుడు కొట్టాడని, ఆ కారణంగా ఈ బ్యూటీ సినిమా నుంచి బయటకు వచ్చేసిందని సమాచారం అందుతుంది.


సూర్య, మమిత ప్రధాన పాత్రలలో బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో ఓ పాత్రలో సూర్య చెవిటి, మూగ పాత్రలో నటించనున్నాడట. అయితే ఈ సినిమా సెట్ లో మమితను బాల కొట్టాడని వస్తున్న వార్తలపై తాజాగా బాల స్పందించాడు. మమిత తన కూతురు లాంటిదని అన్నాడు. అలాంటి అమ్మాయిని నేను ఎందుకు కొడతాను అని బాల అన్నారు.


దీనిపై ఆయన మాట్లాడుతూ షాట్ కి రెడీ అని పిలిస్తే మమిత మేకప్ వేసుకొని వచ్చింది. మేకప్ ఎవరు వేశారని నేను గట్టిగా అరిచాను. అంతే కానీ ఆమెను నేను కొట్టలేదు. చేయి చేసుకోలేదు అని క్లారిటీ ఇచ్చాడు బాల. ఈ సినిమా సెట్ లో మమిత 40 రోజుల పాటు నటించింది. ఇప్పుడు ఆమె సినిమా నుంచి తట్టుకోవడంతో సినిమాను రీ షూట్ చేస్తున్నామని బాలా చెప్పాడు. సినీ ఇండస్ట్రీలో ఈ వార్త తెగ హాట్ టాపిక్ గా మారింది.




మరింత సమాచారం తెలుసుకోండి: