పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD “.. సినిమాతో తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ప్రభాస్ కెరీర్ లో మరో 1000 కోట్ల కలెక్షన్స్  సాధించింది.. ఈ సినిమా తరువాత ప్రభాస్ లైనప్ లో చాలా సినిమాలే వున్నాయి..అందులో “రాజాసాబ్ “ ఒకటి.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. ప్రభాస్ మొదటిసారి సరికొత్త జోనర్ లో నటిస్తున్నాడు.. మాములుగానే మారుతీ సినిమాలో అదిరిపోయే కామెడీ ఉంటుంది.. ఇక హారర్ కథకు కామెడీ యాడ్ అయితే అదిరిపోతుంది.. ఇప్పుడు అదే జోనర్ లో ప్రభాస్ “రాజసాబ్ “ తెరకెక్కుతుంది..ప్రభాస్ తనదైన శైలిలో ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం అవుతున్నాడు..

ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీస్ అయిన మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు..ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ లో టిజి విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.. ఇదిలా ఉంటే ప్రభాస్సినిమా తరువాత హనురాఘవ పూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేస్తున్నాడు..”ఫౌజీ” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో క్యూట్ బ్యూటీ “ఇమన్వి” హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమాలో ప్రభాస్ ఆర్మీ జవాన్ గా  నటిస్తున్నట్లు సమాచారం.. ఇప్పటికే గ్రాండ్ గా ప్రారంభం అయిన ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. ఈ సినిమా తరువాత సందీప్ రెడ్డి వంగా ప్రభాస్ తో “ స్పిరిట్ “ అనే హై ఇంటెన్సివ్ మూవీని తెరకెక్కిస్తున్నాడు.. ఆ సినిమా కూడా ఈ ఏడాదే మొదలు కానుంది.. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి పవర్ ఫుల్ కాప్ గా నటిస్తున్నాడు..



మరింత సమాచారం తెలుసుకోండి: