మహేష్ బాబు ఇండస్ట్రీలో ఎంత పెద్ద హీరో అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అయితే సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న మహేష్ బాబు ప్రెసెంట్ రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమా కోసం బాగా కష్టపడుతున్నాడు. ఈ సినిమా జనవరి ఆఖరి వారంలో సెట్స్ పైకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మహేష్ బాబు కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ తెలుగు మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. మహేష్ బాబు ఒకవేళ హీరో కాకపోయి ఉంటే .. ఏమి అయ్యుండేవాడు ..? అంటూ జనాలు చర్చించుకుంటున్నారు.
గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. మహేష్ బాబు దీనికి ఆన్సర్ ఇచ్చాడు. " తనకి బిజినెస్ అంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ అని .. ఒకవేళ ఇండస్ట్రీలో సెటిల్ కాలేకపోయి ఉంటే మాత్రం బిజినెస్ రంగంలోనే సెటిలై ఉండేవాడిని అని చెప్పుకొచ్చాడు". అంతేకాదు ఇప్పుడు పెద్ద స్టార్ హీరో అయినప్పటికీ మహేష్ బాబు పలు బిజినెస్ లు చేస్తూ కోట్లకు కోట్లు ఆదాయం పొందుతున్నారు . మహేష్ బాబుని ఓ బిజినెస్ మాన్ గా కూడా పలువురు టాలీవుడ్ జనాలు ట్రీట్ చేస్తూ ఉంటారు. చూద్దాం ఈ హీరో రాజమౌళి తో సినిమా ని ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడో..??