ఒకప్పుడు తెలుగు సినిమా అంటే 'జస్ట్ తెలుగు సినిమానే'. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలు..పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ అయ్యి.. తెలుగు ఇండస్ట్రీ స్ధాయిని మార్చేసింది. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే ప్రపంచ దేశాలు షేక్ అయిపోతున్నాయి. కాగా 2024 లో పుష్ప సినిమా ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికి తెలుసు. అయితే 2025 లో ఇండస్ట్రీ హిట్ అయ్యే సినిమాలు ఏవి లేవు. నార్మల్ హిట్ అవుతాయి ఏమో కానీ.. చరిత్ర తిరగ రాసే హిట్స్ అస్సలు లేవు.
ఆ ఆలోచనలు జనాలకి లేవు . బడాబడా స్టార్స్ అందరూ కూడా పలు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. అయితే చిన్న చిన్న సినిమాలు రిలీజ్ అయిన టాలీవుడ్ ఇండస్ట్రీ లో పాన్ ఇండియా స్ధాయిలో హిట్ అయి పోయే సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు . రామ్ చరణ్ - ప్రభాస్ - మహేష్ బాబు - అల్లు అర్జున్-తారక్.. ఇలా స్టార్ హీరోల సినిమాలు ఏది 2005లో రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేవు. కల్కి 2 ..సలార్ 2 సినిమా సెట్స్ పైకి ఇంకా రాలేదు. అవి షూటింగ్ కంప్లీట్ చేసుకుని ఎప్పుడు రిలీజ్ అవుతుందో..? ఆ దేవుడికి తెలియాలి . అయితే 2025 లో మాత్రం కచ్చితంగా ఏ బిగ్ బడా సినిమా రిలీజ్ అయ్యే ఛాన్సెస్ లేదు . దీంతో సోషల్ మీడియాలో 2025 టాలీవుడ్ ఇండస్ట్రీకి శాపంగా మారిపోతుంది అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . 2025 లో ఒక్క బడా పెద్ద స్టార్ సినిమా రిలీజ్ కాకపోతూ ఉండడమే దానికి కారణం అంటూ కూడా జనాలు మాట్లాడుకుంటూ ఉన్నారు..!