అయితే అలా విడాకులు తీసుకున్నా అనంతరం మరొకసారి ఇప్పుడు వివాహం గురించి వార్తలలో నిలుస్తోంది. కరిష్మా కపూర్ తన పిల్లలను ఒంటరిగా ప్రస్తుతం పెంచుతుందట. అయితే ఇప్పుడు ఈ నటి పిల్లల పెరిగి పెద్దవ్వడంతో తన జీవితంలో ముందుకు సాగాలని నిర్ణయం తీసుకున్నట్లుగా బాలీవుడ్లో వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ వ్యాపారవేత్త అయినటువంటి సందీప్ తోష్ని వాల్ తో సంబంధం గురించి మరొకసారి వార్తలలో నిలుస్తోంది. అయితే ఈ ప్రముఖ వ్యాపారవేత్త కరిష్మా కపూర్ ని వివాహం చేసుకోవాలనుకున్నారట. అయితే ఈ విషయం పైన కరిష్మా కపూర్ తండ్రి రణధీర్ కపూర్ వెల్లడించారు.
సంజయ్ కపూర్ తో కరిష్మా కపూర్ వివాహం బంధం ముగిసినప్పుడు ఆమె తన సంబంధం పట్ల చాలా అసంతృప్తిగా ఉన్నదని.. మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకోలేదనే విషయాన్ని కరిష్మా కపూర్ తండ్రి నటుడు రణధీర్ కపూర్ తెలియజేశారు. కరిష్మా కపూర్ గురించి మాట్లాడుతూ తన కూతురు ప్రస్తుతం స్థిరపడే మూడ్లో కనిపించడం లేదు. సంజయ్ నుంచి విడాకులు తీసుకున్న అనంతరం ఆమె పేరు సందీప్ తో ముడిపడి ఉన్నది.. కరిష్మా విడాకుల అనంతరం సందీప్ కూడా తన భార్యకు విడాకులు ఇచ్చారు. దీంతో ఇద్దరు పెళ్లి చేసుకుంటారని రూమర్స్ వినిపించాయి అంటూ కరిష్మా తండ్రి తెలియజేశారు. కరిష్మా కపూర్ కేవలం తన పిల్లలను మంచిగా పెంచాలని మాత్రమే కోరుకుంటోంది అంటూ తెలిపారు.. ఆమె తన జీవితాన్ని మళ్లీ ప్రారంభించాలనుకుంటే తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ కరిష్మా తండ్రి కూడా తెలిపారు. ప్రస్తుతం ఆమె ఒంటరి మహిళ బయటికి వెళ్లాలనుకుంటే ఎవరితోనైనా వెళ్ళవచ్చు.. సందీప్, కరిష్మా స్నేహితుడని విషయాన్ని మాత్రం తెలిపారు.