2024 ఎవరికీ ఎలా గడిచిందో తెలియదు కానీ.. అక్కినేని ఫ్యామిలీకి మాత్రం బాగానే కలిసి వచ్చింది అంటున్నారు జనాలు. 2024 లోనే నాగచైతన్య రెండో పెళ్లి చేసుకున్నాడు . . అంతేకాదు నాగచైతన్య బ్రదర్ అఖిల్ రెండో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ..  అసలు అక్కినేని ఫ్యామిలీను ట్రోల్ చేసే జనాలు సైతం నోరు మూసే విధంగా నాగార్జున తీసుకున్న నిర్ణయాలు హైలెట్గా మారాయి.  గుట్టు చప్పుడు కాకుండా అఖిల్ అక్కినేని బడా ఇంటికి అల్లుడుగా మార్చేయడం అందరికీ షాకింగ్ అనిపించింది .


అంతేకాదు అక్కినేని నాగచైతన్య - శోభిత ధూళ్లిపాళ్ల  పెళ్లి ఇంత త్వరగా జరుగుతుంది అంటూ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేకపోయారు.  ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో అక్కినేని ఫ్యామిలీకి సంబంధించిన మరొక మేటర్ హైలెట్గా మారింది. 2024 ఏ కాదు 2025 కూడా అక్కినేని కుటుంబానికి భారీ విజయాలను శుభవార్తలను తీసుకురాబోతుంది అంటున్నారు జనాలు . 2025లోనే అఖిల్ అక్కినేని పెళ్లి జరగబోతుంది.  అంతేకాదు అన్నీ కలిసి వస్తే 2025 లోనే నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల తమ మొదటి బిడ్డకు జన్మను ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అంటున్నారు అక్కినేని అభిమానులు . .



ఈ విధంగా చూసుకుంటే 2024 ఏ కాదు 2025 కూడా అక్కినేని ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ రెండు గుడ్ న్యూస్ వినడానికి సిద్ధంగా ఉండండి అంటూ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో ట్రెండ్ చేసేస్తున్నారు. కాగా హీరోయిన్ సమంత ని ప్రేమించి పెళ్లి చేసుకున్న నాగచైతన్య ఆ తరువాత ఆమెకి విడాకులు ఇచ్చేసి..సింగిల్ గా ఉన్నాడు. ఇప్పుడు గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపి..శోభిత ధూళిపాళ్లను రెండో పెళ్ళి చేసుకున్నాడు. అక్కినేని ఫ్యామిలీకి రెండో పెళ్లి బాగానే కలిసి వస్తుంది అంటూ ఘాటు కౌంటర్స్ కూడా పడుతున్నాయ్..!

మరింత సమాచారం తెలుసుకోండి: