ఈసినిమాలలో ఏసినిమాకు మంచి టాక్ వచ్చినా నాలుగు వారాలు ఆగితే ఓటీటీ లో వస్తుందిగా అన్న ఆలోచనతో ప్రేక్షకుడు ఉన్నాడు. దీనికి భిన్నంగా టాప్ హీరోల భారీ సినిమాల పరిస్థితి కనిపిస్తోంది. టాప్ హీరోల సినిమాలను ఓటీటీ రిలీజ్ వరకు ఆగకుండా ధియేటర్లలో చూడాలని యూత్ మాత్రమే కాకుండా ఫ్యామిలీ ప్రేక్షకులు కూడ అభిప్రాయ పడుతున్నారు.
అయితే టాప్ హీరోల సినిమాలకు పెరుగుతున్న భారీ టిక్కెట్ల రేట్లు వల్ల చాలామంది భారీ సినిమాలకు కూడ దూరం అవుతున్నారు అన్న అంచనాలు ఇండస్ట్రీ వర్గాలలో వస్తున్నాయి. దీనికి ఉదాహరణగా లేటెస్ట్ గా విడుదలై బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప 2’ ఉదాహరణగా చూపెడుతున్నారు. తెలుగు రాష్ట్రాలలోని చాల ప్రాంతాలలో ఈమూవీ ఇప్పటికీ బ్రేక్ ఈవెన్ కు 10 శాతం తక్కువగా ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి.
దీనితో బ్లాక్ బష్టర్ హిట్ అందుకున్న ‘పుష్ప 2’ కలక్షన్స్ పరిస్థితి ఇలా ఉంటే డివైడ్ టాక్ తెచ్చుకునే టాప్ హీరోల సినిమాల పరిస్థితి ఏమిటి అంటూ బయ్యర్లు కలవర పడుతున్నట్లు టాక్. దీనితో రాబోతున్న సంక్రాంతి రేస్ కు విడుదల కాబోతున్న రామ్ చరణ్ బాలకృష్ణ వెంకటేష్ ల భారీ సినిమాల మార్కెటింగ్ పై ‘పుష్ప 2’ కలక్షన్స్ ప్రభావం ఎంతోకొంత ఉండి తీరుతుంది అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దీనితో టిక్కెట్ల పెంపు మరీ ఎక్కువగా కాకుండా అందుబాటులో ఉంచితే రాబోతున్న సంక్రాంతి సినిమాల కలక్షన్స్ కు సహాయపడుతుంది అని కొందరు బయ్యర్లు చేస్తున్న సూచనలు ఎంతవరకు ఈసినిమాల నిర్మాతలు ఆలోచిస్తారు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..