గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో రెండు ట్రైలర్స్ విడుదల చేసే విధంగా ప్లాన్ చేస్తున్నారట చిత్ర బృందం ఈరోజు విడుదల చేసే ట్రైలర్ ఈ సినిమాను డిసైడ్ చేయబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇటీవలే విజయవాడలో రామ్ చరణ్ భారీ కటౌట్ ఆవిష్కరణలో భాగంగా దిల్ రాజు ఈ విషయాన్ని తెలియజేశారు. అందుకు తగ్గట్టుగానే డైరెక్టర్ శంకర్ కూడా పవర్ ప్యాక్డ్ ట్రైలర్ ని కట్ చేసినట్లు తెలిపారు. ముఖ్యంగా రామ్ చరణ్ పాత్రలకు లుక్స్, ఎమోషనల్, యాక్షన్స్ సన్నివేశాలను హైలైట్ చేసేలా డైరెక్టర్ శంకర్ ట్రైలర్ ని కట్ చేసినట్లు సమాచారం.
తమన్ అందించిన బిజిఎం కూడా ఈ సినిమాకి హైలైట్ గా ఉంటుందని రామ్ చరణ్ ఇందులో ఐఏఎస్ ఆఫీసర్గా ఒక రాజకీయ నాయకుడిగా కనిపిస్తారని అందుకు సంబంధించి పోస్టర్స్ కూడా విడుదలయ్యాయి. అయితే ఇందులో రామ్ చరణ్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కొద్దిసేపు కనపడతారని కూడా వెల్లడించారు. అలాగే రామ్ చరణ్ కు సంబంధించి ఒక లుక్కుకి సంబంధించి ట్రైలర్లో రివీల్ చేయబోతున్నట్లు సమాచారం. మొత్తానికి మెగా అభిమానులకు గేమ్ ఛేంజర్ ట్రైలర్ తో మెగా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ ఉంటుందని టాక్ అయితే ఇప్పుడు వినిపిస్తోంది.మరి ఈ సినిమా నుంచి రెండు ట్రైలర్స్ వస్తాయని టాక్ వినిపిస్తూ ఉన్నది. ఈరోజు ఒకటి రిలీజ్ చేయక మరి సెకండ్ ట్రైలర్ ఎప్పుడు విడుదల చేస్తారో చూడాలి. సినిమా ఈనెల 10వ తేదీన రిలీజ్ కాబోతోంది.