మీనా 40 ఏళ్ల వయసులో కూడా వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో బిజీగా ఉంటున్నా నటి.. ఒకప్పుడు మీనా సౌత్ ఇండస్ట్రీలో ఏ విధంగా బిజీబిజీగా గడిపిందో చెప్పనక్కర్లేదు. ఈ హీరో డేట్స్ కోసం చాలామంది హీరోలు ఎదురుచూసేవారు. అలా డేట్స్ కోసం ఎదురుచూసే హీరోలలో చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున.వెంకటేష్ వంటి హీరోలు కూడా ఉన్నారు. అయితే మీనా సినిమాల్లో చేస్తున్న సమయంలో ఈమెపై ఎన్నో రూమర్లు వినిపించాయి. అందులో కొన్ని ఎఫైర్ వార్తలు కూడా ఉన్నాయి. అలా నటి మీనా వెంకటేష్ తో ఎక్కువ సినిమాలు చేయడం కారణంగా వెంకటేష్ మీనాకి మధ్య ఎఫైర్ వార్తలు రాశారు. అలాగే మీనా కి నటుడు కిచ్చా సుదీప్ కి మధ్య కూడా ఈ ఎఫైర్ వార్తలు రాశారు. గతంలో అయితే మీనా కిచ్చా సుదీప్ ని పెళ్లి చేసుకుంది అనే వార్త కూడా బయటకు వచ్చింది. కానీ ఇందులో ఎలాంటి నిజం లేదు అని వాళ్ళు క్లారిటీ ఇచ్చారు.

 ఇక రీసెంట్ గా మీనా భర్త చనిపోయాక కూడా కిచ్చా సుదీప్ ని రెండో పెళ్లి చేసుకుంటుంది అని, ధనుష్ పెళ్లి చేసుకుంటుంది అని ఇలా ఎంతోమంది మాటలతో మీనా మనసుని గాయపరిచారు. కానీ మీనా ప్రతిసారి ఈ వార్తలను ఖండిస్తూనే వస్తోంది. ఈ విషయం పక్కన పెడితే తెలుగులో హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న మీనా కి ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ ప్రశ్న ఎదురయింది.మీనాని యాంకర్ మీరు చాలా మంది తెలుగు హీరోలతో వర్క్ చేశారు. కానీ ఒక్క తెలుగు హీరోతో కూడా ప్రేమలో పడలేదా..ఎందుకు అలా అని ప్రశ్నించింది. దానికి మీనా మాట్లాడుతూ నేను ఎంతో మంది తెలుగు హీరోలతో నటించాను.కానీ ఆ హీరోలతో నటించే సమయంలో నా వయసు చాలా తక్కువ.ఆ టైంలో నాకు ప్రేమ పెళ్లి అనే విషయం గురించి ఎక్కువగా అవగాహన లేదు. నేను వెంకటేష్ తో చంటి సినిమా చేసినప్పుడు నా ఏజ్ 15 సంవత్సరాలు మాత్రమే..

అలా చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ మోహన్ బాబు వంటి హీరోలతో నేను సినిమాలు చేసిన సమయంలో వాళ్ళ ఏజ్ కంటే నా ఏజ్ చాలా తక్కువ. నేను వారి ముందు చిన్నపిల్లని. అందుకే నాకు ప్రేమా పెళ్లి గురించి అంతగా అవగాహన లేదు.. వాళ్ళందరూ నాకంటే ఏజ్ లో పెద్దవారు.వారితో నేను చాలా సరదాగా ఉండేదాన్ని. నన్ను వారు చిన్న పిల్లలాగే చూసుకునేవారు. మోహన్ బాబు అయితే నాతో మాట్లాడిన కూడా నాకు భయం అయ్యేది. ఎందుకంటే ఆయన మాటలు బెదిరించినట్లుగా ఉండేవి. ఇక నేను నటించిన హీరోలలో బాలకృష్ణ గారు ఒక్కరే ఎక్కువగా మాట్లాడే వారు. ఇక వాళ్లతో స్క్రీన్ షేర్ చేసుకునే సమయంలో ప్రేమించేంత మెచూరిటీ నాకు లేదు.అందుకే టాలీవుడ్ హీరోలతో ప్రేమలో పడలేదు అంటూ మీనా షాకింగ్ విషయాన్ని బయట పెట్టింది

మరింత సమాచారం తెలుసుకోండి: