ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 2024 సంవత్సరంలో హాట్ టాపిక్ అయ్యాడు. పుష్ప 2 సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అల్లు అర్జున్ పేరు మారుమోగింది. ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో... 2024 సంవత్సరంలో మోస్ట్ పాపులర్ హీరోగా కూడా చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. అదే సమయంలో రేవతి మృతి కారణంగా వివాదాస్పద పాలు కూడా అయ్యాడు అల్లు అర్జున్. ఇలాంటి నేపథ్యంలో 2025 కొత్త సంవత్సరం వచ్చింది.

 

ఇక ఈ సంవత్సరంలో... అల్లు అర్జున్ ముందు పెను సవాళ్లే ఉంటాయి. ఎందుకంటే పుష్ప 2 సినిమా తర్వాత రిలీజ్ అయ్యే ప్రతి సినిమా అదే రేంజ్ లో ఆడాల్సి ఉంటుంది. ఇక తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ తో చేస్తున్నాడు అల్లు అర్జున్. ఇప్పటికే అల్లు అర్జున్ అలాగే త్రివిక్రమ్ కాంబినేషన్లో వచ్చిన సినిమాలు అన్ని హిట్ అయ్యాయి.  వీరిద్దరి కాంబినేషన్లో నాలుగవ సినిమా రాబోతుంది. త్రివిక్రమ్ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో జులాయి, అలా వైకుంఠపురం లో రెండు సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి.


దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే నెక్స్ట్ ప్రాజెక్టుపై అందరి కండ్లు  ఉన్నాయి. ఇక త్రివిక్రమ్ అలాగే అల్లు అర్జున్ సినిమా కోసం.... మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ ఆర్ రెహమాన్ రంగంలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో సినిమాకు.. హైట్ పెంచేందుకు ఏఆర్ రహమాన్ ను తీసుకువస్తున్నారట. అలాగే ఈ సినిమాలో... బాలీవుడ్ హీరోయిన్ దీపికా ను సెలెక్ట్ చేశారట.

 

దీపికా పదుకొనే తో పాటు పూజా హెగ్డే కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో కూడా తీయబోతున్నారట. అలాగే ఈ కొత్త సంవత్సరంలో... తెలంగాణ ప్రభుత్వంతో మరిన్ని సవాళ్లు అల్లు అర్జున్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపైన థియేటర్కు వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. అసలు థియేటర్ కు వెళ్లకుండా ఉంటేనే బెటర్ అని కొంతమంది సూచిస్తున్నారు. అలా చేస్తేనే ఇప్పుడు అల్లు అర్జున్ సక్సెస్ అయ్యే ఛాన్స్ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: