టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ సినిమాలలో పోకిరి సినిమా ఒకటి. ఇంకా చెప్పాలంటే మహేష్ కెరీర్లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా పోకిరి అని చెప్పాలి. 2006 ఏప్రిల్ 27న బాలకృష్ణ వీరభద్ర సినిమాకు పోటీగా రిలీజ్ అయిన పోకిరి సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. ఏకంగా 63 కేంద్రాలలో 175 రోజులు పూర్తి చేసుకుంది .ఆ రోజుల్లోనే రు . 80 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లతో పాటు కాస్త అటు ఇటుగా రు . 50 కోట్ల షేర్ కాబట్టి అప్పటివరకు తెలుగు సినిమా చరిత్రలో ఆల్ టైం ఇండస్ట్రీ హిట్టుగా రికార్డుల్లోకి ఎక్కింది. మహేష్ బాబు కి జోడిగా ఇలియానా హీరోయిన్గా నటించిన పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఇదిలా ఉంటే మహేష్ బాబు బ్లాక్ బస్టర్ పోకిరి టైటిల్ని వాడుకుని ఇప్పుడు టాలీవుడ్ లో మరో సినిమా వస్తోంది.
వికాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వరుణ్ రాజ్ హీరోగా నటిస్తున్నారు .. మమత హీరోయిన్గా నటిస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి నా గుండె జారిపోయిందే అంటూ సాగే మొదటి పాటను మేకర్స్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ వికాస్ మాట్లాడుతూ మేము స్టోరీ లైన్ రాసుకున్నప్పటి నుంచి పోకిరి అనే టైటిల్ అనుకున్నాం .. వేరే టైటిల్ పెడదాం అనుకున్న పోకిరిని బాగా సెట్ అవుతుందని ఫిక్స్ చేసుకున్నాం .. కథ రాసుకున్నప్పటి నుంచి ఈ సినిమా మీద చాలా కేర్ తీసుకున్నాం .. సినిమా హిట్ అవుతుందన్న నమ్మకం ఉంది అని అన్నారు. మరి మహేష్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇప్పుడు మరోసారి హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.