అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తాను ఐకాన్ స్టార్ అని పుష్ప 2 ది రూల్ సినిమాతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమా బాక్సాఫీస్ షేక్ చేస్తూ ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే రు. 1700 కోట్లకు పైగా వసూళ్లు కొల్లగొట్టింది. బన్నీ అలవైకుంఠపురంలో - పుష్ప - పుష్ప 2 లాంటి మూడు సూపర్ డూపర్ హిట్ సినిమాలతో కెరీర్లో తిరిగిలేని హీరో అయిపోయాడు. ఈ క్రమంలో నే బన్నీ తర్వాత చేయబోయే సినిమాపై అంచనాలు విపరీతంగా పెరిగాయి. అల్లు అర్జున్ - త్రివిక్రమ్ శ్రీనివాస్ తో తన కొత్త ప్రాజెక్టును ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? ఎప్పుడు రిలీజ్ అవుతుంది ? అంటూ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బన్నీ - త్రివిక్రమ్ సినిమాకి సంబంధించి నిర్మాత నాగవంశీ తన తాజా ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం త్రివిక్రమ్ స్క్రిప్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారని .. త్వరలో బన్నీ కూడా త్రివిక్రమ్ తో కూర్చుంటారని .. తన పాత్రకు సంబంధించిన గెటప్ . . . సెటప్ విషయంలో చర్చలు జరుపుతారని షూటింగ్ ను 2025 మిడిల్ నుంచి స్టార్ట్ చేసి 2026 ఎండింగ్లో సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినట్టు నాగ వంశీ చెప్పుకోవచ్చారు.
ఇప్పటికే త్రివిక్రమ్ - బన్నీ కాంబినేషన్లో వచ్చిన జులాయి - సన్నాఫ్ సత్యమూర్తి - అలవైకుంఠపురం లో మూడు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. బన్నీ - త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే సూపర్ హిట్ అలా మూడు సూపర్ హిట్ల తర్వాత నాలుగో సారి మళ్ళీ వీరిద్దరూ కలిసి జత కట్టారు. హారిక హాసిని క్రియేషన్స్ మరియు గీతా సంస్థలు కలిసి భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించబోతున్నారు.