కృతి శెట్టి కూడా మొదట్లో సినిమాలపరంగా మంచి విజయాలు అందుకున్న వరుసగా ఈ మధ్యకాలంలో ఫ్లాపులను ఎదుర్కొంటోంది. దీంతో తెలుగులో అవకాశాలు రాకపోవడంతో ఇతర భాషలలో తమ అదృష్టాన్ని పరీక్షిస్తోంది. తెలుగులో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. మెగా మేనల్లుడికి ఇప్పుడు కచ్చితంగా ఒక సక్సెస్ కావాలి తను చేస్తున్న కథలు ఏవి అంత వర్కౌట్ కాకపోవడంతో వైష్ణవ్ తేజ్ కెరియర్ డైలమా లో పడింది. దీంతో వైష్ణవ్ తేజ్ తో సినిమాలు తీయాలి అంటే నిర్మాతలు కూడా వెనకడుగు వేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం సితార బ్యానర్ పైన ఒక సినిమా చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ నుంచి సినిమా వస్తోంది అంటే కచ్చితంగా ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందనేలా నిర్మాత నాగవంశీ నిర్ణయాలు తీసుకుంటారనే పేరు ఉన్నది.. మరి ఈ మెగా హీరోకి ఈసారైనా హిట్టు దక్కేలా అవుతుందేమో చూడాలి. మెగా కుటుంబ సపోర్టు ఉన్నప్పటికీ కూడా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నారు వైష్ణవ్ తేజ్. మరి ఈసారైనా కథల ఎంపికలు ఆచితూచి అడుగులు వేసి 2025 లో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి మరి.