ఈ విషయం చిరంజీవికి కూడా తెలియడంతో వాడిని నా దగ్గరికి తీసుకురా బుద్ధి చెబుతాను అని కూడా అరవింద్ కు చెప్పారట. ఒకరోజు చిరంజీవి శ్రీదేవి థియేటర్ లో సినిమా చూస్తుండగా ఆ మేనేజర్ ఫుల్లుగా మందేసి థియేటర్ ముందుకు వచ్చి చిరంజీవి ఎక్కడ ? బయటకు రమ్మను వాడి సంగతి చెబుతా అంటూ మత్తులో ఊగిపోతూ ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నాడట. వెంటనే అల్లు అరవింద్ నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో . .. గొడవ చేయటం బాగోదని కారులో ఎక్కించబోతే అల్లు అరవింద్ ని కిందకి తోసి మరి చిరంజీవిని బూతులు తిడుతున్నాడట.
వెంటనే అల్లు అరవింద్ వాచ్ - కళ్ళజోడు పక్కనపెట్టి ఆ మేనేజర్ కాలర్ పట్టుకుని ఉతికి పడేసాడట. అల్లు అరవింద్ గట్టిగా కొట్టడంతో అతనికి 13 కుట్లు పడ్డాయట. ఓవైపు చిరంజీవి థియేటర్లో సినిమా చూస్తున్నాడు .. చిరంజీవి గారికి కూడా ఆ బూతులు విని ఉంటే ఇంకా కోపం వచ్చేది అని చాలా రోజుల క్రితం జరిగిన సంఘటన బయట పెట్టారు. .