ఈ క్రమంలోనే ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లాలో ( ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ) ఉన్న నల్లజర్ల మండలంలోని అనంతపల్లి అన్ని చిన్న మామూలు పంచాయితీ కేంద్రంలో అన్నపూర్ణ థియేటర్లో సింహాద్రిని రిలీజ్ చేశారు అనంతపల్లి అప్పట్లో చాలా చిన్న పల్లెటూరు. ఇప్పుడు కూడా ఓ పంచాయతీ మాత్రమే. అనంతపల్లి లో సింహాద్రి సినిమా రిలీజ్ చేయడం వెంటనే చాలామంది షాక్ అయ్యారు. కానీ సినిమాకు సూపర్ డూపర్ హిట్ టాక్ రావడంతో 50 రోజులపాటు హౌస్ఫుల్ ఆడేసింది. నల్లజర్ల - ఎర్నగూడెం - అనంతపల్లి - దూబచర్ల - పోతవరం - రాజవరం - భీమడోలు తో పాటు చుట్టుపక్కల ఉన్న 70 పల్లెటూర్ల నుంచి సింహాద్రి సినిమా చూసేందుకు అనంతపల్లి అన్నపూర్ణ థియేటర్ కు జనాలు పోటెత్తారు.
అసలు 50 రోజుల వరకు అన్ని షోలు హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఆ తర్వాత కూడా సినిమా మంచి కలెక్షన్లతో వంద రోజులు ఆడిం.ది చివరకు ఈ థియేటర్లో సింహాద్రి 150 రోజులు పాటు ఆడటం అప్పట్లో ఓ గొప్పగా చెప్పుకున్నారు. అనంతపల్లి - నల్లజర్ల సినీ చరిత్రలో ఎక్కువ రోజులు ఆడిన సినిమాగా సింహాద్రి రికార్డుల్లో అలా నిలిచిపోయింది. ఈ క్రెడిట్ జూనియర్ ఎన్టీఆర్ ఒక్కడికే దక్కింది.