ఆమె సినిమా పరిశ్రమంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంతో పాటు అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసింది .. కానీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొంది .. 18 ఏళ్లకే ప్రేమించి పెళ్లి చేసుకుంది .. 20 ఏళ్లకే తల్లి అయింది .. తర్వాత విడాకులు తీసుకుని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది ... ఆ రెండో కాపురం కూడా ఎక్కువ కాలం నిలవలేదు ... రెండుసార్లు విడాకులు తీసుకుని ఒంటరిగా గడుపుతున్న ఈ భామ ఇప్పుడు దేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న టీవీనట్టుగా మారింది ఆమె ఎవరో ఆ స్టోరీ ఏంటో ?తెలుసుకుందాం. ఆమె ఎవరో కాదు బుల్లితెర నటి శ్వేతా తివారి.


ఆమె గురించి తెలుగు ప్రేక్షకుల కంటే ... ఎక్కువగా హిందీ ప్రేక్షకులకు బాగా తెలుసు .. హిందీలో ఎక్కువ పాపులర్ అయిన సీరియల్ నటి కసోటి జిందగీ. ఇందులో ప్రధాన పాత్ర‌లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది శ్వేతా వారి. ప్రేరణ శర్మ అనే పాత్రలో అద్భుతంగా నటించి మెప్పించింది. ఏడేళ్ల పాటు ఈ సీరియల్ ద్వారా అలరించి. ఆ తర్వాత బిగ్బాస్ సీజన్ ఫోర్ లో పాల్గొంది .. తన ఆటతీరుతో రియాల్టీ షో టైటిల్ గెలుచుకుంది. దీంతో సోషల్ మీడియాలో శ్వేతా వారి పేరు మార్మోగింది. ఆ తర్వాత ఆమెకు విపరీతంగా ఫాలోయింగ్ పెరిగింది. ప్రస్తుతం సినిమాలు చేస్తూ మంచి బిజీగా ఉన్న ఆమె వెండితెరపై మంచి గుర్తింపు తెచ్చుకుంది.


1998లో నటుడు రాజా చౌదరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి పాలక్‌ తివారి అనే పాప జన్మించింది. వీరిద్దరూ 2007లో విడాకులు తీసుకున్నారు. 2013లో అభినవ్ కోహ్లీ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోగా వీరికి రేయాన్స్ కోహ్లీ జన్మించాడు. అయితే వీరిద్దరి బంధం కూడా ఎక్కువ కాలం సాగలేదు. 2019లో తన భర్త గృహ హింసకు పాల్పడుతున్నాడని కోర్టును ఆశ్రయించగా కోర్టు విడాకులు మంజూరు చేసింది. అయితే వరుస సీరియల్స్ ద్వారా సంపాదిస్తోంది. కొన్ని నివేదికల ప్రకారం ఆమె ఆస్తి 100 కోట్లకు పైనే ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: