తెలుగు తెరకు పరిచయమైన గ్లామరస్ హీరోయిన్లలో దీప ఒకరు. అమెరికా అమ్మాయి సినిమాతో తెలుగు తెరకు దీప పరిచయం అయ్యారు. దీప మలయాళీ అమ్మాయి .. 1980 లలో ఆమె హీరోయిన్గా ఎన్నో విజయాలు అందుకున్నారు. పంతులమ్మ సినిమాతో పాటు నందమూరి బాలకృష్ణ కు జోడిగా సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వంలో వచ్చిన అక్బర్ సలీం అనార్కలి సినిమాలో ను ఆమె అమర ప్రేమికురాలుగా అద్భుతమైన నటన చేశారు. అలాగే వంశీ దర్శకత్వంలో వచ్చిన లేడీస్ టైలర్ సినిమా కూడా ఆమెకు మంచి పేరు తెచ్చి పెట్టింది. 1986 లో వచ్చిన లేడీస్ టైలర్ సినిమా ఘన జయం సాధించింది. ఈ సినిమాలో వై విజయతో పాటు సంధ్య అలాగే దీప కూడా డయా అనే ముఖ్యమైన పాత్రలో నటించారు.
దీప కు అప్పట్లో మంచి క్రేజ్ వుంది .. ఈ సినిమాలో ఆమెను తీసుకుంటే సినిమాకు మరింత ఆకర్షణ తోడు అవుతుందని అందరూ భావించారు. ఈ సినిమాకు సంబంధించి వంశీ తన తాజా వీడియోలో దీప గురించి ప్రస్తావించారు. తాను ఆరోజు తీసే సీన్ల గురించి ఆలోచన చేస్తుంటే కారు వచ్చి ఆగింది .. కారులో నుంచి దీప దిగింది .. ఆమెను చూసి యూనిట్ వాళ్లు అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోయారు.. దీపకాదు పెద్ద పీపా అంటూ గుసగుసలాడుకున్నారు .. అదేంటండి ఆమె అంత లావుగా ఉన్నారు .. మీరు వెళ్లి అడ్వాన్స్ ఇచ్చినప్పుడు సన్నగానే ఉన్నారు కదా అని నిర్మాత తల పట్టుకున్నారట.
అప్పుడు మెరుపుతీగలా ఉన్నారు అని సాయిబాబా గారు అన్నారట .. దీపకి అభిమానిని కావడంవల్ల ఈవిడ గారు దిగిపోతుందని తెలిసినప్పటి నుంచి చాలా ఫీలయ్యాను .. ఇప్పుడు ఏదోలా అయిపోతున్నాను అన్నారట తమ్ముడు సత్యం. దీప లావు సంగతి పక్కనపెట్టి షూటింగ్ మొదలుపెట్టాము .. దీప బరువు పెరగటం సంగతి అందరూ మరిచిపోయి ఎవరి పని వాళ్ళు చేసుకోవటానికి కొద్ది రోజులు పట్టినట్టు అప్పటి విషయాలను వంశీ గుర్తు చేసుకున్నారు.