సంక్రాంతి పండుగ కానుకగా మూడు సినిమాలు రిలీజ్ కానుండగా ఈ సినిమాలపై మంచి అంచనాలు నెలకొన్నాయి. మొదట గేమ్ ఛేంజర్ జనవరి 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ అవుతుండగా డాకు మహారాజ్ జనవరి 12వ తేదీన సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14వ తేదీన రిలీజ్ కానున్నాయి. ఈ మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు ఫీలవుతున్నారు.
ఈ మూడు సినిమాలు 1000 కోట్ల మార్కును అందుకుంటాయా లేదా అనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుండటం గమనార్హం. ఈ సినిమాలన్నీ సక్సెస్ సాధించి సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కంగనా ఎమర్జెన్సీ జనవరి 17వ తేదీన విడుదల కానుండగా విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంతోశ్ మూవీ జనవరి నెల 10వ తేదీన రిలీజ్ కానుంది.
అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన స్కై ఫోర్స్ మూవీ ఈ నెల 24వ తేదీన విడుదల కానుందని సమాచారం అందుతోంది. లాహోర్ 1947, దేవ మరికొన్ని సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమాలపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. గేమ్ ఛేంజర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఈ సినిమా ఫుల్ రన్ కలెక్షన్లు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది. గేమ్ ఛేంజర్ కోసం మెగా అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.