తెలుగు సినిమా పరిశ్రమలో హిట్స్ కంటే ప్లాపులు ఎక్కువ .. వందల్లో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో సక్సెస్ రేట్ 10 % కూడా ఉండదు. ఇప్పుడున్న పరిస్థితులలో తెలుగు సినిమా సక్సెస్ రేట్ కేవలం 7 నుంచి 8% మధ్యలో మాత్రమే ఉంది. ఈ యేడాది కూడా ఎన్నో సినిమాలు వచ్చాయి .. ఊహించినట్టే చాలా సినిమాలు ప్లాప్ అయ్యాయి. కొన్ని సినిమాలు ఊహించిన విధంగా డిజాస్టర్ అయ్యాయి. టాలీవుడ్ లో ప్రతి శుక్రవారం నెంబర్ గేమ్ మారిపోతూ ఉంటుంది. ప్రతి శుక్రవారం విడుదలయ్యే సినిమా హిట్ అయితే .. ఆ సినిమా హీరో పైకి వెళ్ళిపోతాడు .. సినిమా ప్లాప్ అయితే కిందకి పడిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉంటే మెగా హీరో వరుణ్ తేజ్ పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఒకప్పుడు కనీసం 8 నుంచి 10 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటూ మినిమం గ్యారంటీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు.
వరుణ్ తేజ్ సినిమా వస్తుంది అంటే బయ్యర్లు పోటీపడి కాస్త మంచి రెట్లు పెట్టి కొనుగోలు చేసేవారు. అయితే ఈ ఏడాది వరుణ్ 3 పెద్ద డిజాస్టర్లు ఇచ్చాడు. అతడు నటించిన ఆపరేషన్ వాలెంటైన్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో ఎవరికి తెలియదు. అది అతిపెద్ద ప్లాప్. అంతకుముందు చేసిన గాంఢీవధారి అర్జున సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది. ఇవన్నీ ఇలా ఉంటే మట్కా సినిమా అయితే వరుణ్ తేజ్ చరిత్రలోనే అతిపెద్ద ఘోరమైన డిజాస్టర్ సినిమాగా చెత్త రికార్డు అతడి ఖాతా లో వేసింది. అంతకుముందు అల్లు అర్జున్ పెద్ద కుమారుడు అల్లు బాబీ నిర్మించిన గని సినిమా కూడా పెద్ద డిజాస్టర్ అయింది. అలా వరుణ్ తేజ్ నటించిన చివరి నాలుగు సినిమాల వల్ల టాలీవుడ్కు ఏకంగా 110 నుంచి 120 కోట్ల రేంజ్ లో నష్టాలు వచ్చినట్టు ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.