రామ్ చరణ్ .. రామ్ చరణ్ .. రామ్ చరణ్ .. ఒకప్పుడు కూడా ఈ మెగా హీరో పేరు బాగా ట్రెండ్ అయ్యేది. కానీ ఇప్పుడు మాత్రం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పేరు భారీ స్థాయిలో వైరల్ గా మారింది . దానికి కారణం "గేమ్ చేంజర్".  సినిమా అన్న విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించిన తాజా సినిమా "గేమ్ చేంజర్". ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ కియరా అద్వానీ..  అదేవిధంగా తెలుగు అమ్మాయి హీరోయిన్ అంజలి హీరోయిన్లుగా నటించారు.


సినిమా జనవరి 10వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది . పాన్  ఇండియా లెవెల్లో తెరకెక్కిన ఈ సినిమా ఆ స్థాయిలోనే రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు రాంచరణ్ "గేమ్ చేంజర్" సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షో కి వెళ్లాడు చరణ్.  బాలయ్య తన షోకి వచ్చిన గెస్ట్ లను ఎలా ఆడుకుంటాడో అన్న విషయం అందరికీ తెలిసిందే.  చాలా చిలిపి ప్ర్శ్నలు.. చాలా సరదా ప్రశ్నలు అడుగుతూనే ఉంటాడు .



అయితే రామ్ చరణ్ ఈ షోకి రాగా .. రామ్ చరణ్ చేత ప్రభాస్ కి కాల్ చేయించి.. మరి ఓ సీక్రెట్ రివీల్ చేయించారట.  అది కూడా రాంచరణ్ గతంలో ప్రభాస్ అన్ స్టాపబుల్ షోకి వచ్చినప్పుడు రామ్ చరణ్.. ప్రభాస్ ని ఎలా అడ్డంగా ఇరికించేశారో అందరికీ తెలిసిందే . ఇప్పుడు రామ్ చరణ్ అన్ స్టాపబుల్ షో కి గెస్ట్ గా వచ్చిన మూమెంట్లో బాలయ్య - ప్రభాస్ ని కాల్ చేసి మరి రామ్ చరణ్ టాప్ సీక్రెట్ ని అందరి ముందే రివీల్ చేయించేసాడట . దీంతో అప్పుడు రామ్ చరణ్ కొట్టిన దెబ్బకి ఇప్పుడు ప్రభాస్ రివేంజ్జ్ తీర్చుకున్నారు.  ఫ్రెండ్షిప్ లో ఇలాంటివి కామన్ బ్రో అంటూ తెగ ట్రెండ్ చేసేస్తున్నారు జనాలు. మొత్తానికి రామ్ చరణ్ - ప్రభాస్ మధ్య ఫ్రెండ్షిప్ ని మరోసారి బయటపెట్టాడు బాలయ్య అన్ స్టాపబుల్ ద్వారా అంటున్నారు అభిమానులు..!

మరింత సమాచారం తెలుసుకోండి: