పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలకు ముందు మూడు చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందులో కొన్ని సినిమాలు సగంలో షూటింగ్ కాగా మరికొన్ని పూర్తి కావాల్సి ఉన్నది. అలాంటి చిత్రాలలో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా ఒకటి.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోతోంది. ఇందులో హీరోయిన్ గా శ్రీలీలని కూడా ఎంపిక చేయడం జరిగింది. ఈ చిత్రానికి సంబంధించి గ్లింప్స్ కూడా రిలీజ్ చేయగా అభిమానులకు సూపర్ గా నచ్చింది. దీంతో కచ్చితంగా హరీష్ శంకర్ మళ్లీ గబ్బర్ సింగ్ లాంటి సినిమాతో అభిమానులను మెప్పించడానికి సిద్ధమవుతున్నారనే విధంగా అందరూ భావించారు.


అయితే ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తూనే ఉండడంతో డైరెక్టర్ హరీష్ శంకర్ రవితేజతో కలిసి మిస్టర్ బచ్చన్ అనే సినిమాని తెరకెక్కించారు.ఈ సినిమా రీమిక్స్ సినిమా అయినప్పటికీ ఘోరమైన డిజాస్టర్ ని మూట కట్టుకుంది. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం కూడా  తమిళంలో వచ్చిన తేరి సినిమాకి రీమేక్ అన్నట్లుగా వార్తలు వినిపించాయి.. ఈ చిత్రాన్ని ఇటీవలే బాలీవుడ్ లో వరుణ్ ధావన్, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ కలిసి దర్శకత్వంలో తమిళ డైరెక్టర్ అట్లీ నిర్మాణంలో బేబీ జాన్ అనే టైటిల్ తో తెరకెక్కించారు.


సినిమా కూడా క్లాప్ గా మిగిలిపోయింది. దీంతో ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా పై కూడా ఇలాంటి అనుమానాలే మొదలవుతున్నాయి. ప్రస్తుతం డైరెక్టర్ హరిశంకర్ కూడా సరైన పాములో లేరని అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇతర సినిమాల కమిట్మెంట్లు వల్ల కూడా ఈ సినిమా ఉంటుందా లేదా అనే చర్చ ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలయ్యిందట. అంతేకాకుండా చాలామంది ఇటివలె డైరెక్టర్లు తను సమయాన్ని ఇచ్చిన కూడా వృధా చేశారనే విధంగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి వీటన్నిటిని చూస్తూ ఉంటే అసలు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఉంటుందా లేదా చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: