టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 హీరోలలో మ్యాచో హీరో గోపీచంద్ సినిమా అంటే ఒకప్పుడు మంచి అంచనాలు ఉండేవి. అలాంటిది గోపీచంద్ నుంచి అందరికీ లాభాలు తెచ్చి పెట్టిన చివరి సినిమా ఏది అంటే లౌక్యం సినిమా అని మాత్రమే చెప్పాలి. ఆ సినిమా వచ్చి కూడా దాదాపు పది ఏళ్ళు అవుతోంది. ఈ పదివేల కాలంలో గోపీచంద్ నుంచి అటు సినిమా తీసిన నిర్మాతలకు కొన్న డిస్ట్రిబ్యూటర్లు .. బయ్యర్లు .. ఎగ్జిబిటర్లు ప్రతి ఒక్కరికి మంచి లాభం తెచ్చి పెట్టిన సినిమా ఒక్కటంటే ఒక్కటి కూడా లేదు. అంటే గోపీచంద్ కేరీర్ ఎంత దారుణమైన స్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గోపీచంద్ అస్సలు ఏమాత్రం కథలపై కాన్సన్ట్రేషన్ చేయకుండా కేవలం రెమ్యూనరేషన్ మాత్రమే తీసుకుంటూ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గత ఏడాది రామబాణం లాంటి డిజాస్టర్ ఇచ్చిన ఈ హీరో ఈ యేడాది అయినా మంచి హిట్ ఇస్తాడని అందరూ ఆశిస్తే ఒకటి కాదు ఏకంగా రెండు డిజాస్టర్లు ఇచ్చాడు.
రామబాణం సినిమాకు ఏ మాత్రం తీసుకుని విధంగా భీమా సినిమా పెద్ద డిజాస్టర్ అయింది. భీమా సినిమా ట్రైలర్ సక్సెస్ అయింది .. సినిమా ఆడుతుందని అందరూ అనుకున్నారు. ఊహించిన విధంగా సినిమా డిజాస్టర్ అయింది. ఇక విశ్వం సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. లాంగ్ గ్యాప్ తర్వాత శ్రీనువైట్ల నుంచి వచ్చిన సినిమా ఇది. గోపీచంద్ యాంగిల్ లో కంటే శ్రీను వైట్ల కోణంలోనే ఈ సినిమాను ఎక్కువమంది చూశారు. ఈ సినిమా ఖచ్చితంగా మంచి హిట్ అవుతుందని అనుకున్నారు.
అయితే శ్రీనువైట్ల తన పాత టెంప్లేట్ అయిన దూకుడు - బాద్ షా స్టైల్ లోనే విశ్వం సినిమాను తెరకెక్కించారు.. సినిమా నిరాశపరిచింది. అయితే ఉన్నంతలో కాస్త బెటర్ ఏంటంటే విశ్వం సినిమా ఎవరిని నష్టపరచలేదు. కాస్త అటు ఇటుగా బ్రేక్ వెనుక దగ్గరగా వచ్చింది. నిర్మాత విశ్వ ప్రసాద్ కూడా కాస్త ఈ సినిమాతో హ్యాపీ అవ్వటం ఒక్కటే మెచ్చుకోదగ్గ విషయం. ఏది ఏమైనా ఇకపై గోపిచంద్ రెమ్యునరేషన్ గురించి పట్టించుకోకుండా మంచి కథాబలం ఉన్న సినిమాలతో పాటు మంచి దర్శకులను ఎంపిక చేసుకున్న సినిమాలు చేస్తేనే లైఫ్ ఉంటుంది. లేకపోతే గోపీచంద్ కెరీర్ దాదాపు ముగిసినట్టే చెప్పాలి.