టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ సాలిడ్ క్రేజ్ కలిగిన హీరోలలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఈయన ఇప్పటివరకు తన కెరియర్ లో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాల్లో నటించాడు. అలాగే కొన్ని బ్లాక్ బాస్టర్ సినిమాలను రిజక్ట్ కూడా చేశాడు. ఇకపోతే ఓ రెండు సినిమాలను రిజెక్ట్ చేసినట్లు స్వయంగా తారక్ ఒప్పుకున్నాడు. ఆ సినిమాలు ఏవి అనే వివరాలను తెలుసుకుందాం.

కొన్ని సంవత్సరాల క్రితం సిద్ధార్థ్ హీరో గా జెనీలియా హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో బొమ్మరిల్లు అని సినిమా రూపొందిన విషయం మనకు తెలిసిందే. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమాను నిర్మించాడు. ఇకపోతే ఒకానొక ఇంటర్వ్యూలో భాగంగా తారక్ "బొమ్మరిల్లు" కథను భాస్కర్ మొదట నాకు వినిపించాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. కానీ ఆ కథలో యాక్షన్ సన్నివేశాలు , భారీ డైలాగులు వంటివి ఏమీ లేవు. నా సినిమాకు వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా నా సినిమాలో భారీ యాక్షన్ సన్నివేశాలు , మాస్ డైలాగ్స్ ఉండాలి అనుకుంటారు. అవి లేనట్లయితే ఆ సినిమా రిసల్ట్ తేడా కొట్టే అవకాశం ఉంటుంది. అందుకే నాకు బొమ్మరిల్లు మూవీ కథ నచ్చిన ఆ సినిమాను రిజెక్ట్ చేశాను అని చెప్పాడు.

ఇక కొన్ని సంవత్సరాల క్రితం రవితేజ హీరోగా మీరా జాస్మిన్ హీరోయిన్గా బోయపాటి శ్రీను దర్శకత్వంలో భద్ర అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాను కూడా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఒకానొక సందర్భంలో భాగంగా తారక్ "భద్ర" సినిమా కథను బోయపాటి శ్రీను నాకు వినిపించాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఈ మూవీ ని నేను రిజెక్ట్ చేశాను అని చెప్పుకొచ్చాడు. ఇకపోతే తారక్ తాను రిజెక్ట్ చేశాను అని స్వయంగా చెప్పిన ఈ రెండు మూవీ లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాలను సొంతం చేసుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: