అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాల డిసెంబర్ 5వ తేదీన వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. చాలా కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట కుటుంబ సభ్యుల సమక్షంలో అంగరంగ వైభవంగా వివాహాన్ని జరుపుకున్నారు. సమంతతో విడాకుల అనంతరం నాగచైతన్య శోభిత దూళిపాళ్లతో అతి తక్కువ సమయంలోనే ప్రేమలో పడ్డాడు. మొదట స్నేహంగా పరిచయమైన వీరు అది తక్కువ సమయంలోనే ప్రేమలో పడ్డారు. చాలా సందర్భాలలో బయట చట్టాపట్టాలేసుకొని తిరిగారు. 

వీరికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అయినప్పటికీ శోభిత, నాగచైతన్య ఎవరూ కూడా స్పందించలేదు. సడన్ గా ఎంగేజ్మెంట్ జరుపుకొని అందరికీ షాక్ ఇచ్చారు. వివాహం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం థండెల్ సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన అనంతరం నాగ చైతన్య, శోభిత హనీమూన్ ట్రిప్ కి బయటికి వెళ్లాలని ప్లాన్ లో ఉన్నారట. విదేశాలలో హనీమూన్ జరుపుకోవాలని అనుకుంటున్నారట. 

శోభిత కూడా ప్రస్తుతం సినిమా షూటింగ్ లలో చురుగ్గా పాల్గొంటుంది. వివాహం జరిగినప్పటికీ ఎప్పటిలాగే శోభిత ఉంటుంది. మరి శోభిత ఇదివరకే ఒప్పుకున్న ప్రాజెక్టులలో మాత్రమే నటిస్తుందని ఆ తర్వాత సినిమాలు పూర్తిగా మానేస్తుందని ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో వైరల్ అవుతుంది. కాగా, నాగచైతన్య ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు. జిమ్ చేయడం, వ్యాయామాలు చేయడం వంటి వాటిలో చురుగ్గా ఉంటాడు. 

ఇక ఫుడ్ విషయంలో చాలా మంచి ఆహారం ఉండేలా చూసుకుంటాడు. ఇక వివాహమైన తర్వాత శోభిత కారణంగా డైట్ విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. శోభిత ఫుడ్ విషయంలో కొన్ని కండిషన్స్ పెట్టడంతో ఫుడ్ చాలా తగ్గించాడని వార్తలు వస్తున్నాయి. ఇక గతంలో కూడా అక్కినేని నాగచైతన్య.... తన మొదటి భార్య హీరోయిన్ సమంత మాట వినేవారట. ఆమె చెప్పినట్లుగానే ఫుడ్ డైట్ చేసేవారట. ఆరోగ్యం కాపాడుకునేందుకు... సమంత అనేక టిప్స్ ఇచ్చేదట. ఇక ఇప్పుడు శోభిత కూడా అలాగే చేస్తోందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: