అదే సమయంలో... తన మాతృత్వం గురించి అదిరిపోయే శుభవార్త చెప్పింది హీరోయిన్ ఇలియానా. తాను అక్టోబర్ మాసంలోనే రెండోసారి ప్రెగ్నెంట్ అయినట్లు... ఈ సందర్భంగా ప్రకటించింది. అలాగే ప్రెగ్నెన్సీ కిట్ లో పాజిటివ్.. ఉన్న సింబల్ చూపించి రచ్చ చేసింది. దీంతో హీరోయిన్ ఇలియానా రెండోసారి తల్లి కాబోతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అయ్యాయి.
వాస్తవంగా 2023 సంవత్సరం ఆగస్టు మాసంలోనే హీరోయిన్ ఇలియానా తల్లి అయింది. ఓ పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది హీరోయిన్ ఇలియానా. సినిమాలకు గత కొన్ని రోజులుగా దూరంగా ఉంటున్న హీరోయిన్ ఇలియానా... అధికారికంగా మాత్రం ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. తన ప్రియుడు మైకల్ తోనే జీవితాన్ని గడిపేస్తోంది. అంతేకాదు డోలాన్ అనే కుమారుడ్ని కూడా అతనితో కన్నది హీరోయిన్ ఇలియానా కావడం విశేషం.
అయితే ఒక్కరు కాకుండా మరొకరిని కనేందుకు... హీరోయిన్ ఇలియానా అలాగే మైకేల్ జంట డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటన చేసింది హీరోయిన్ ఇలియానా. ఇది ఇలా ఉండగా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలు చేసింది హీరోయిన్ ఇలియానా. దేవదాసు సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా వచ్చిన ఈ బ్యూటీ... దాదాపు పది సంవత్సరాలు టాలీవుడ్ ఇండస్ట్రీని ఏలింది. కానీ ఆ తర్వాత బాలీవుడ్ కి వెళ్లి... పూర్తిగా సినిమాలకు కూడా దూరమైంది ఇలియానా.