యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఏ రేంజ్ లో క్రేజ్ ఉందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో 100 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకునే సత్తా ఉన్న అతికొద్ది మంది హీరోలలో ఎన్టీఆర్ కూడా ఒకరు కావడం గమనార్హం. ఏడాదికి ఒక సినిమా విడుదలయ్యేలా కెరీర్ ప్లాన్ చేసుకుంటున్న తారక్ గతేడాది దేవర సినిమాతో హిట్ అందుకోగా ఈ ఏడాది వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
 
ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కి సంక్రాంతి పండుగ సందర్భంగా సంచలనాలు సృష్టించిన సినిమాలు అన్నీఇన్నీ కావు. అదుర్స్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ బాక్సాఫీస్ ను షేక్ చేశారని చెప్పడంలో సందేహం అవసరం లేదు. కలెక్షన్ల విషయంలో సైతం అదుర్స్ మూవీ సత్తా చాటిందని కచ్చితంగా చెప్పవచ్చు. వి.వి. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో మెప్పించింది.
 
అదుర్స్ సినిమాలో తారక్ డ్యూయల్ రోల్ లో నరసింహ, నరసింహాచారి పాత్రల్లో కనిపించి మెప్పించారు. ఈ రెండు పాత్రలకు తారక్ పూర్తిస్థాయిలో న్యాయం చేయడంతో పాటు తన పర్ఫామెన్స్ తో అదుర్స్ అనిపించారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ సినిమాల్లో అదుర్స్ ఒకటని చెప్పడంలో సందేహం అవసరం లేదు. తారక్ కెరీర్ ప్లాన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాయని చెప్పవచ్చు.
 
ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీకి రవి బస్రూర్ మ్యూజిక్ అందించనున్నారని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. ఈ సినిమా షూటింగ్ సైతం అతి త్వరలో మొదలుకానుందని మేకర్స్ వెల్లడించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పరంగా మరిన్ని బ్లాక్ బస్టర్ హిట్లను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.


 


మరింత సమాచారం తెలుసుకోండి: