మన టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు విపరీతంగా వస్తున్నాయి. ముఖ్యంగా ఏడాదికాలంగా షూటింగ్ చేసుకున్న సినిమాలన్నీ సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతి సంక్రాంతికి... రెండు తెలుగు రాష్ట్రాలలో సినిమాల పండుగ కొనసాగాలని ఉంది. అయితే ఇప్పటివరకు సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన చాలా.... సినిమాలు బంపర్ హిట్ అయ్యాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య కూడా ఉంది.

 

2023 సంక్రాంతి కానుకగా ఈ సినిమా రిలీజ్ అయి బంపర్ హిట్ అందుకుంది. జనవరి 13వ తేదీ 2023.. అంటే సంక్రాంతి కంటే రెండు రోజుల ముందే.. పండుగ వాతావరణం తీసుకువచ్చింది మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య మూవీ. ఈ సినిమాలో శృతిహాసన్ అలాగే మెగాస్టార్ చిరంజీవి కీలక పాత్రల్లో కనిపించారు. అటు మాస్ మహారాజ్ రవితేజ ప్రత్యేక పాత్రలో కనిపించి.. సినిమాకు మంచి డోస్ ఇచ్చారు.

 

చిరంజీవి మాస్ యాంగిల్ ను దర్శకుడు కేఎస్ రవీంద్ర అద్భుతంగా తెరకెక్కించారు. ఇక ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీత స్వరాలు అందించారు. నవీన్ ఎర్నేని అలాగే రవిశంకర్... నిర్మాతలుగా ఈ సినిమాకు పని చేసిన సంగతి తెలిసిందే. ఊర మాస్ యాంగిల్ లో వచ్చిన ఈ సినిమా కోసం దాదాపు 140 కోట్ల బడ్జెట్ అయింది. ఈ సినిమా కోసం దాదాపు 140 కోట్లు పెడితే... ఓవరాల్ గా మొత్తం 215 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టగలిగింది వాల్తేరు వీరయ్య మూవీ.

 

మన భారతదేశవ్యాప్తంగా ఏకంగా 187 కోట్ల గ్రాస్.. 160 కోట్ల షేర్  సాధించగలిగింది వాల్తేరు వీరయ్య. ఓవర్సీస్ 28.5 కోట్ల గ్రాస్ సాధించగలిగింది. దీంతో నిర్మాతలకు... భారీగానే లాభాలు వచ్చాయి. అటు ఓటిటి రేటు కూడా భారీగానే పలికింది. మొత్తానికి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య.... సంబరాన్ని తీసుకువచ్చింది. ఈ సినిమా ఫ్యామిలీ అలాగే మాస్ యాంగిల్  ఇష్టపడేవారు ఎగబడి చూశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: