సినిమా సెట్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ తినే భోజనాన్ని చూసి చాలామంది చులకనగా మాట్లాడేవారట. అయితే శోభన్ బాబు ఎక్కువగా ఇష్టపడి తినేది వడపాయసం.. ఇది లేనిదే ప్రతిరోజు ముద్ద కూడా దిగేది కాదట శోభన్ బాబుకి. ఇది కచ్చితంగా తన ఇంట్లో ప్రతిరోజు ఉండేలా చూసుకునే వారట. మొదట శోభన్ బాబు చిన్న చిన్న పాత్రలలో జూనియర్ ఆర్టిస్టుగా నటించారు. ముఖ్యంగా ఆ సమయంలో భోజనాలు పెడితే రైస్ సాంబార్ పెరుగు ప్యాకెట్ ఇచ్చేవారట..
పెద్ద ఆర్టిస్టులకే ఎక్కువగా వడ పాయసం వంటివి ఇచ్చేవారట. అయితే ఒకసారి నోరు తెరిచి ఆఫీస్ బాయ్ని వడా పాయసం అడగగా తన అవమానించడంతో చాలా బాధపడ్డారట. ఈ విషయాన్ని ప్రముఖ రైటర్ నటుడు తోటపల్లి మధు వెల్లడించారు.. అయితే ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా ఎదిగారని ఆరోజు ప్రొడక్షన్ బై అవమానాన్ని శోభన్ బాబు చివరి వరకు మరిచిపోలేదని.. అలాంటి కసితోనే తాను ఆ స్థాయిలోకి వెళ్లారని అలా అప్పటినుంచి ప్రతిరోజు కూడా భోజనంలో వడా పాయసం ఉండేలా చూసుకునే వారిని తెలిపారు. ముఖ్యంగా మధు శోభన్ బాబు ఎన్నో చిత్రాలకు రైటర్ గా కూడా పనిచేశారు అంతేకాకుండా శోభన్ బాబు ఇంటికి వెళ్లి చాలాసార్లు భోంచేసారట.