- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం తన తర్వాత సినిమాని దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది సంక్రాంతి కి గుంటూరు కారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన మహేష్ బాబు ఇప్పటికే యేడాది పాటు ఖాళీగా ఉన్నారు. ఇక దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తాను నటించే తన కేరీర్‌ 29వ సినిమా ప్రారంభోత్సవం జనవరి 2 వ తేదీన లాంచ్ చేయబోతున్నట్టు ఇప్ప‌టికే ప్రకటించారు. దీంతో యావత్ ఇండియాసినిమా వైపు చూస్తోంది. ఈ సినిమాతో గ్లోబల్గా మహేష్ - రాజమౌళి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తారని కూడా ఇండియన్ సినీ సర్కిల్స్ లో చక్కెరలు కొడుతోంది. ఇది ఇలా ఉంటే ప్రేమికులకు ఎంతో స్పెషల్ అయినా ప్రేమికుల రోజున మహేష్ బాబు నటించిన ఓ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది.


మహేష్ బాబు నటించిన సినిమాలన్నీ ఇటీవల వరుస పెట్టి రి రిలీజ్ అవుతూ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. రీ రిలీజ్ లోను అదిరిపోయే వసూళ్లు కొల్లగొడుతున్నాయి. ఈ క్రమంలోని మహేష్ బాబు - అమృత రావు జంటగా తరుకెక్కిన అతిధి మూవీ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్ర‌వ‌రి 14న రిలీజ్ కానుంది. 2007లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్న స్థాయిలో సక్సెస్ కాకపోయి నా ఈ సినిమాలో మహేష్ పెర్ఫార్మన్స్ కు ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యారు. దీంతో ఇప్పుడు ఈ సినిమాను రిలీజ్ చేస్తూ ఉండడంతో అతిధి సినిమాని మరోసారి థియేటర్లలో చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మ‌ణిశ‌ర్మ స్వ‌రాలు అందించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: