- ( టాలీవుడ్‌ - ఇండియా హెరాల్డ్ ) . . .


టాలీవుడ్ లో క్రియేటివ్ జీనియ‌స్ డైరెక్టర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు సుకుమార్. అసలు ఇప్పుడు సుకుమార్ పేరు దేశ వ్యాప్తంగా మార్మోగిపోతోంది. మరి ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కించిన పుష్ప 1 - పుష్ప 2 సినిమాలు ఏ స్థాయిలో హిట్ అయ్యాయో చూశాం. ఇక పుష్ప 2 సినిమా అయితే దాదాపు బాహుబలి 2 రికార్డులకు అతి చేరువు లో ఉంది. కొద్ది రోజుల్లో బాహుబలి 2 రికార్డులను కూడా పుష్ప 2 దాటేయటం ఖాయంగా కనిపిస్తోంది. తనదైన మార్క్ మూవీ మేకింగ్ తో బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సినిమాలను వరుసగా తెరకెక్కిస్తున్నారు. సుకుమార్ సినిమా ల ప‌రంగా ఎంత బిజీ గా ఉన్నా కూడా త‌న ఫ్యామిలీ కి ఎంతో టైం ఇస్తూ ఉంటారు. సుకుమార్ భార్య పేరు బ‌బిత‌. వీరిది ప్రేమ వివాహం అన్న సంగ‌తి తెలిసిందే.


సుకుమార్ కు ఒక పాప‌.. ఒక అబ్బాయి .. ఇది ఇలా ఉంటే తాజాగా సుకుమార్ కూతురు సుకృతి వేణి టాలీవుడ్లోకి ఎంట్రీస్తోంది. బాలనట్టుగా ఆమె గాంధీతాత చెట్టు అనే సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. ఈ సినిమాను పద్మావతి మల్లాడి అనే లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తూ ఉండటం మరో విశేషం. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్‌ చేశారు. గాంధీతాత చెట్టు సినిమాను జనవరి 24న థియేటర్లలోకి తీసుకు రాబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాను movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ - గోపి టాకీస్ బ్యానర్లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నాయి. మ‌రి సుకుమార్ కూతురు సినిమా ఎలా మెప్పిస్తుందో ?  చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: