టాలీవుడ్లో ఈ సంక్రాంతికి ఒకటి కాదు రెండు కాదు భారీ అంచనాలో ఉన్న మూడు సినిమాలు ధియేటర్లలోకి దిగుతున్నాయి. నందమూరి నటసింహ బాలకృష్ణ నటించిన డాకు మహారాజ్ .. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన పాన్ ఇండియా ప్రెస్టేజ్ మూవీ గేమ్ ఛేంజర్ ... అలాగే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు సంక్రాంతికి పోటీపడుతున్నాయి. ఈ మూడు సినిమాలకు అంచనాలు ఉన్న దర్శకులు దర్శకత్వం వహించారు. బాలయ్య సినిమాకు వాల్తేరు వీరయ్య సినిమాతో ఫామ్ లో ఉన్న బాబి ... రామ్ చరణ్ సినిమాకు స్టార్ డైరెక్టర్ శంకర్ ... వెంకటేష్ సినిమాకు అసలు ప్లాప్ అన్నది లేకుండా డబుల్ హ్యాట్రిక్ లు కొట్టిన అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. మూడు మంచి అంచనాలతో క్రేజీ బ్యానర్లలో తెరకెక్కాయి. అందులో గేమ్ ఛేంజర్ - సంక్రాంతి వస్తున్నాం రెండు సినిమాలు దిల్ రాజు బ్యానర్లో తెరకెక్కినవి కావటం విశేషం.
ఫ్రీ రిలీజ్ అంచనాలను బట్టి ఈ మూడు సినిమాలలో ఏ సినిమాకు కాస్త ఎక్కువ ప్రి రిలీజ్ బజ్ ఉందన్నది పరిశీలిస్తే ఆ అడ్వాంటేజ్ బాలయ్య డాకు మహారాజ్ సినిమాకు కనిపిస్తోంది. బాలయ్య మూడు వరుస సూపర్ డూపర్ హిట్లతో ఫామ్ లో ఉండడంతో పాటు దీనికి తోడు అటు డైరెక్టర్ బాబి చివరి సినిమా కూడా హిట్ అవ్వడం.. ఇటు అన్ స్టాపబుల్ షో తో బాలయ్య ఫ్యామిలీ ఆడియెన్స్ లో కూడా క్రేజ్ తెచ్చుకోవడం .. ఇప్పటికే రిలీజ్ అయిన టైటిల్ టీజర్ తో పాటు ప్రమోషనల్ కంటెంట్ కూడా జనాల్లోకి బాగా వెళ్లడంతో డాకూ మహారాజ్ మీదే ఎక్కువ అంచనాలు ఉన్నాయి. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్నాం మాగ్జిమం హిట్ అంటున్నారు. ఇక గేమ్ ఛేంజర్ పాన్ ఇండియా ప్రాజెక్టు కావడం .. శంకర్ ఇటీవల అంచనాలు తప్పుతుండడంతో సినిమా రిలీజ్ అయ్యాక కాని ఈ సినిమా రిజల్ట్ అంచనా వేయలేం.