మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ కొణిదెల గత 40 సంవత్సరాలుగా తన భర్త విజయాలలో తెరవెనక ఉంటూ ఎంతో సహకారం అందిస్తూ వచ్చారు. ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటారు అన్న నానుడి నిజం చేస్తూ కొణిదెల సురేఖ ఓర్పు .. సహనం ఈరోజు చిరంజీవి మెగాస్టార్ ను చేయడంలో ఎంతో కీలకపాత్ర అని చెప్పాలి. సురేఖ అప్పుడప్పుడు కొన్ని ఈవెంట్స్ కి హాజరవుతూ ఉంటారే తప్ప సినిమాలకు సంబంధించిన వ్యవహారంలో ఆమె ఏనాడు ప్రత్యక్షంగా గాని ... పరోక్షంగా గాని ఇన్వాల్వ్ అయింది లేదు. 156 సినిమాలకు పైగా నటించిన మెగాస్టార్ చిరంజీవి సతీమణి అయినప్పుడు చిత్ర పరిశ్రమ గురించి ఆమెకు తప్పకుండా అవగాహన ఉంటుంది. ఆ అవగాహనతో ఆమె అప్పుడప్పుడు తీసుకున్న కొన్ని నిర్ణయాలు సత్ఫలితాలను ఇచ్చాయి. పవన్ కళ్యాణ్ ను హీరోగా మార్చడంలో సురేఖ నిర్ణయం కూడా ఉంది. పవన్ కళ్యాణ్ హీరోగా బాగుంటాడు అనే సురేఖ చెప్పడంతో చిరంజీవి తన సోదరుని ఇండస్ట్రీలోకి తీసుకువచ్చాడు.
పవన్ కళ్యాణ్ తొలి సినిమా అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి. ఈ సినిమా ఈవీవీ సత్యనారాయణ దర్శకత్వంలో తెరకెక్కింది. ఈ సినిమాలో అక్కినేని నాగేశ్వరరావు మనవరాలు యార్లగడ్డ సుప్రియ హీరోయిన్గా నటించారు. ఇక పవన్ కళ్యాణ్ రెండో సినిమా గోకులంలో సీత. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో తరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ కోసం వెతుకుతున్నప్పుడు సడన్గా సురేఖ ఎంట్రీ ఇచ్చి పవన్ కి పర్ఫెక్ట్ జోడిని సెలెక్ట్ చేశారు. గోకులంలో సీత సినిమాలో హీరోయిన్ ఎంపిక భలే విచిత్రంగా జరిగిందట. అంతకుముందు హీరోయిన్ రాశిని సురేఖ ఓ సినిమాలో చూశారట. ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనిపించిందట డైరెక్టర్ రవిరాజా పినిశెట్టి ద్వారా రాశి ఫోన్ నెంబర్ తీసుకుని సురేఖ ఫోన్ చేశారు. చిరంజీవి మిమ్మల్ని ఇంటికి పిలుస్తున్నారు అని అబద్ధం చెప్పారు.. చిరంజీవి గారు నన్ను ఎందుకు పిలుస్తున్నారు అని రాశి ఆశ్చర్యపోయిందట.. సరే ఒకసారి వెళదాం ఎందుకైనా మంచిది ఫోటో ఆల్బమ్ కూడా తీసుకువెళ్దాం అని రాశి చిరంజీవి ఇంటికి వెళ్లారట.
రాశికి చిరంజీవి ఇంటికి వెళ్ళాక అర్థమైందట .. పిలిచింది చిరంజీవి గారు సురేఖ గారు అని.. ! వెంటనే సురేఖ రాశి తో హోమ్లీగా, ట్రెడిషనల్ డ్రెసుల్లో చాలా బావున్నావు. వెస్ట్రన్ డ్రెస్సుల్లో కూడా నీతో ఫోటో షూట్ చేయాలని.. రాశీతో బలవంతంగా వెస్ట్రన్ డ్రెస్సులు వేయించారట. ఫోటో షూట్ పూర్తయ్యాక సురేఖ ఈ అమ్మాయి.. పవన్ పక్కన బావుంటుందని చెప్పడంతో ఆ ట్విస్ట్‌కు రాశీకి మైండ్ బ్లాక్ అయిపోయిందట.