జీవితం ముందుకు వెళుతున్న కొద్దీ మన జీవితంలో ముందు జరిగిన కొన్ని ఇంపార్టెంట్ విషయాలను జనాలు మళ్లీ గుర్తు చేసుకుంటూ ఉంటారు. వారికి జీవితంలో జరిగిన మంచి ని ఎక్కువ సార్లు తలుచుకుంటూ ఆనంద పడుతూ ఉంటారు. ఇకపోతే తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో రష్మిక మందన ఒకరు. ఈ బ్యూటీ కూడా తన జ్ఞాపకాల్లో ఒక దానిని గుర్తు చేసుకొని తెగ సంతోష పడుతున్నట్లు తెలుస్తోంది. అదేమిటి అనుకుంటున్నారా ..? ఆమె నటించిన మొదటి సినిమా విడుదల అయిన తేదీ.

ఈమె నటించిన మొదటి సినిమా కన్నడ మూవీ అయినటువంటి కిరాక్ పార్టీ. ఈ మూవీ డిసెంబర్ 30 వ తేదీన విడుదల అయింది. ఈ మూవీ లో రక్షిత్ శెట్టి హీరోగా నటించాడు. ఈ మూవీ కన్నడలో మంచి విజయాన్ని సాధించింది. ఈ మూవీ తో ఈ బ్యూటీ కి మంచి సక్సెస్ వచ్చింది. ఈ మూవీతో రక్షిత్ శెట్టి ఈమెను వెండి తెరకు పరిచయం చేశాడు. ఇక ఈ సినిమా సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దానితో వీరికి నిశ్చితార్థం కూడా జరిగింది. తర్వాత ఈమెకు తెలుగులో అవకాశాలు రావడం , ఈమె నటించిన తెలుగు సినిమాలు భారీగా విజయాలు సాధించడంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఈమెకు ఫుల్ క్రేజ్ వచ్చింది.

ఇక అదే సమయంలో రష్మిక , రక్షిత మధ్య సమస్యలు మొదలయ్యాయి. దానితో వీరిద్దరూ విడిపోయారు. విడిపోయాక రష్మిక తన కెరియర్ కోసమే రక్షిత్ ను వదిలి వేసింది అనే విమర్శలు కూడా రష్మిక పై వచ్చాయి. దానితో రక్షిత్ ఆమెపై ఎలాంటి విమర్శలు చేయకండి అని విన్నవించడంతో ఈమెపై విమర్శలు తగ్గాయి. ఇకపోతే ప్రస్తుతం రష్మిక టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rm