దివంగత నటి శ్రీదేవి మరణం గురించి ఇప్పటికి మిస్టరీగానే ఉంటుంది.ఎందుకంటే ఆమె బాత్ టబ్ లో పడి చనిపోవడం చాలామందికి షాకింగ్ గా అనిపించింది. ఇక బాత్ టబ్ లో పడి చనిపోవడం గురించి బోనీ కపూర్ ఆ మధ్యకాలంలో క్లారిటీ ఇస్తూ శ్రీదేవికి మద్యపానం సేవించే అలవాటు ఉంది.అలాగే ఆమె కఠినమైన డైట్ పాటించడం వల్ల చాలాసార్లు స్పృహతప్పి పడిపోయేది.అలా దుబాయ్ కి పెళ్లి కోసం వెళ్లే సమయంలో కూడా శ్రీదేవి మద్యం సేవించి బాత్ టబ్ లో స్నానం చేయడానికి వెళ్లి అక్కడే స్పృహ తప్పి అందులోనే పడిపోయింది.దాంతో ఊపిరాడక మరణించింది అంటూ క్లారిటీ ఇచ్చారు.కానీ బోనీకపూర్ మాటలపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు.

అంతేకాదు 200 కోట్లు ఇన్సూరెన్స్ కోసమే శ్రీదేవిని హతం చేశారు అంటూ ఎంతోమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. అయితే శ్రీదేవి పేరు మీద 200 కోట్ల ఇన్సూరెన్స్ ఉందట.ఆమె చనిపోతే 200 కోట్ల ఇన్సూరెన్స్ వస్తుంది అనే ఉద్దేశంతో శ్రీదేవిని చంపేశారు అనే టాక్ కూడా అప్పట్లో వినిపించింది. అయితే ఈ విషయం గురించి సీనియర్ సినీ జర్నలిస్ట్ అయినటువంటి ఈమంది రామారావు కూడా స్పందించారు. శ్రీదేవి మరణం ఎప్పటికీ మిస్టరీనే..ఆమె 200 కోట్ల ఇన్సూరెన్స్ కోసం శ్రీదేవిని మరణించేలా చేశారు.. కొద్దిపాటి మద్యం సేవించి బాత్ టబ్ లో పడి చనిపోయింది అంటే నమ్మశక్యంగా లేదు.

ఆమె సినిమాలో నటించినప్పటి నుండి మద్యం సేవించే అలవాటు ఉంది. అలాంటిది కొంచెం మందు తాగి అలా చనిపోయింది అంటే ఎవరు నమ్మరు. శ్రీదేవిని 200 కోట్ల ఇన్సూరెన్స్ రూపంలో మృత్యువు కభళించింది. ఆమెను పక్కగా ప్లాన్ చేసి మరణించేలా చేశారు.. అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఈమంది రామారావు. అయితే ఈమంది రామారావు చాలా రోజులు శ్రీదేవి దగ్గర పనిచేసిన సంగతి మనకు తెలిసిందే.అలా శ్రీదేవి జీవితాన్ని దగ్గర నుండి చూసిన ఈయన శ్రీదేవి గురించి ఎన్నో తెలియని విషయాలు కూడా బయటపెట్టారు

మరింత సమాచారం తెలుసుకోండి: