సంక్రాంతి వినోదానికి కేరాఫ్ అడ్రెస్. అభిమానుల్లో అన్ లిమిటెడ్ ఆనందాన్ని లోడ్ చేయడానికి హీరోలు ఆ పండగరోజునే తమ సినిమాలతో మరో పండగను సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు. కొందరు హీరోలు కొన్నేళ్ళుగా తమ అభిమానుల్ని సంక్రాంతి సీజన్ లో తమ సినిమాలతో ఓ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తున్నారు.ఇక అక్కినేని నాగార్జున తన కెరీర్ లో మొత్తం 5 సార్లు మాత్రమే సంక్రాంతి సినిమాలతో వచ్చారు. అలా రిలీజ్ అయినా సినిమాలలో 2016 జనవరి 15న రిలీజైన సోగ్గాడే చిన్నినాయనా మూవీ నాగార్జున కెరీర్ లోనే హైయస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ ఏడాది రిలీజైన సంక్రాంతి మూవీస్ లో నెంబర్ 1 గా నిలిచింది.ఈ చిత్రంలో నాగార్జున తండ్రి కొడుకులుగా నటించారు. అంతేకాదు నాగ్ తన కెరీర్‌లో తండ్రి కొడుకులుగా నటించిన తొలి చిత్రం ‘సోగ్గాడే చిన్నినాయనా’ మూవీ.సోగ్గాగే చిన్నినాయనా’ మూవీ నాగార్జున కెరీర్‌లో తొలి రూ. 50 కోట్ల షేర్ సాధించిన తొలి చిత్రం. అంతేకాదు నాగ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఇదిలావుండగా 2016లో సంక్రాంతి కానుకగా డిక్టేటర్, నాన్నకు ప్రేమతో, ఎక్స్‌ప్రెస్ రాజా వంటి సినిమాలు రిలీజైన బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని సంక్రాంతి హిట్ అనిపించుకుంది ’సోగ్గాడే చిన్నినాయనా’. అంతేకాదు  నాగార్జున కెరీర్‌లో తొలి సంక్రాంతి హిట్‌గా నిలిచిపోయింది.ఈ చిత్రంలో నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడిగా నటించారు.సోగ్గాడే చిన్నినాయనా సినిమాతో నాగార్జున కళ్యాణ్ కృష్ణ అనే దర్శకుడిని టాలీవుడ్‌కు పరిచయం చేసాడు. అంతేకాదు నాగార్జున తొలిసారి ఈ సినిమాలో ఆత్మ పాత్రలో నటించారు. అంతేకాదు ఈ సినిమాలో మరో కథానాయికగా లావణ్య త్రిపాఠి నటించింది.అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌లో నాగార్జున నిర్మించిన ఈ చిత్రంలో అనుష్క శెట్టి మరో కథానాయికగా నటించింది. ఇంకోవైపు ఈ సినిమాలో అనసూయ, నాగబాబు, నాజర్, బ్రహ్మానందం, సంపత్ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.ఈ క్రమంలోనే సోగ్గాడే చిన్ని నాయనా సినిమాకు సీక్వెల్గా రూపొందిందే బంగార్రాజు. అక్కినేని నాగ చైతన్యతో చేసిన బంగార్రాజు  సినిమాను కూడా కళ్యాణ్ కృష్ణ డైరెక్ట్ చేశారు. 2022లో సంక్రాంతి ఫైట్లో నిలిచి ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: