తెలుగు సినీ పరిశ్రమలు మంచి వ్యక్తిత్వం కలిగిన స్టార్ హీరోలలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన నిజ జీవితంలో ఎంతో సరదాగా ఉంటూ జనాలను కలుపుకుంటూ వెళుతుంటారు. దానితో బయట బాలకృష్ణ వ్యక్తిత్వాన్ని చాలా మంది ఇష్టపడుతూ ఉంటారు. ఇకపోతే బాలకృష్ణ తన సినీ జీవితాన్ని మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. కానీ ఆయన సినిమా జీవితాన్ని మొదలు పెట్టిన తర్వాత సినిమాల్లో నటించడం తప్ప ఏ షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరించలేదు.

అలా చాలా సంవత్సరాల పాటు కెరీర్ ను కొనసాగించిన బాలయ్య కొంత కాలం నుండి ఆహా ఓ టీ టీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఆన్ స్టాపబుల్ టాక్ షో కి హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఈ టాక్ షో కు సంబంధించిన మూడు సీజన్లో కంప్లీట్ అయ్యాయి. ప్రస్తుతం నాలుగవ సీజన్ నడుస్తోంది. ఇకపోతే ఆన్ స్టాపబుల్ టాక్ షో ద్వారా బాలయ్యకు మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజ్ సినిమాతో పాటు రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ , వెంకటేష్ హీరోగా రూపొందిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు కూడా విడుదల కానున్నాయి.

ఆన్ స్టాపబుల్ టాక్ షోకు డాకో మహారాజ్ సినిమా యూనిట్ తో పాటు ఇప్పటికే సంక్రాంతికి వస్తున్నాం సినిమా యూనిట్ కూడా వచ్చింది. గేమ్ చేంజర్ మూవీ హీరో అయినటువంటి చరణ్ కూడా ఈ టాక్ షో కు వచ్చాడు. ఇప్పటికే చరణ్ కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ పూర్తి అయ్యింది. మరికొన్ని రోజుల్లోనే ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది. ఇలా బాలయ్య తన సినిమాలతో పాటు పోటీగా ఉన్న మూవీ బృందాలను సపోర్ట్ చేస్తూ రావడంతో ఈయనపై ప్రస్తుతం అనేక మంది ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: