•మహేష్ బాబుకు సంక్రాంతి కలిసొచ్చిందా
•భారీ విజయాలే కాదు అవార్డులు కూడా..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు విడుదలవుతున్నాయంటే చాలు.. సినిమాలు ఎలా ఉన్నా అభిమానులు చేసే రచ్చ గురించి చెప్పాల్సిన పనిలేదు. మహేష్ బాబు ఎక్కువగా సంక్రాంతికి తమ సినిమాలను విడుదల చేసే విధంగా ఎప్పుడు ప్లాన్ చేస్తూ ఉంటారు. సంక్రాంతికి విడుదల చేసిన సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకుంటూ ఉంటాయి. అలా ఇప్పటివరకు సంక్రాంతికి 7సార్లు ప్రేక్షకుల ముందుకి మహేష్ బాబు రావడం జరిగింది. ఇందులో ఎక్కువసార్లు మహేష్ బాబు విన్నర్ గానే నిలిచినట్లు సమాచారం.
మొదటిసారి కౌబాయ్ పాత్రలో టక్కరి దొంగ సినిమాలో నటించిన మహేష్ బాబు.. 2002లో ఈ సినిమా సంక్రాంతికి విడుదలైనా.. కమర్షియల్ గా విజయాన్ని అందుకోలేకపోయింది. ఆ తర్వాత 2003లో డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా మహేష్ కెరియర్ కి టర్నింగ్ అయింది. 2012 నుంచి మూడేళ్లుగా ఏడాదికి ఒక్క చిత్రాను విడుదల చేస్తూ మంచి విజయాలను అందుకున్నారు. 2012 లో డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బిజినెస్ మాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తెలుగు సినీ పరిశ్రమను మరొక స్థాయికి తీసుకువెళ్లింది. ఈ చిత్రంలోని పాత్రలు సామాన్య కుటుంబాలలో జరిగేటువంటి సన్నివేశాలను చూపించారు.
ఇక తర్వాత ఏడాది మహేష్, వెంకటేష్ కాంబినేషన్లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ని మెప్పించడమే కాకుండా మల్టీస్టారర్ సినిమాలను మరొకసారి తెర పైకి తీసుకువచ్చేలా చేశారు. ఈ సినిమాతో అవార్డులు కూడా అందుకోవడం జరిగింది. ఎవర్ గ్రీన్ మూవీగా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు నిలిచిపోవడం గమనార్హం.
ఇక 2014లో డైరెక్టర్ సుకుమార్, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన నేనొక్కడినే సినిమా సక్సెస్ కాలేక పోయింది. ఆ తర్వాత మళ్లీ 2020లో సరిలేరు నీకెవ్వరు సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. గత ఏడాది 2024లో గుంటూరు కారం సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నారు మహేష్ బాబు. మొత్తానికి సంక్రాంతికి తన సినిమాలతోనే విజయాలను అందుకున్నారు.