పుష్ప 2 మూవీ సృష్టించిన సంచలనం అంతా కాదు .. ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే సరికొత్త చరిత్రను తిరగరాసింది. ఏకంగా సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతుంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్పా2 2024 డిసెంబర్ 5న విడుదలైన విషయం తెలిసింది .. ఇంకా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. ఎన్నో రికార్డులు బ్రేక్ చేసి చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతుంది. ఇక పుష్పా2 సినిమా కలెక్షన్ లు ఇప్పటికే 1700 కోట్లు దాటాయి .. సంక్రాంతి వరకు పెద్ద సినిమాలు సరిగ్గా లేకపోవడంతో ఇది బాహుబలి 2 లాంగ్ ర‌న్‌ రికార్డులను బ్రేక్ చేయబోతుందని అంటున్నారు. మిగిలింది దంగల్ రికార్డులు మాత్రమే. ఈ సినిమా 2000 కోట్లు కలెక్షన్లు రాబట్టింది. ఇక మరి ఈ రికార్డును కూడా బ్రేక్ చేస్తుందా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. కానీ ఓ కమర్షియల్ సినిమా ఈ రేంజ్ లో కలెక్షన్లు సునామీ సృష్టించడం అందరికీ షాక్ ఇస్తుంది. ట్రేడ్ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే ఇప్పుడు ఈ మూవీ ఏరియా వైస్ గా చూసుకుంటే మాత్రం చాలా చోట్ల ప్లాఫ్ అని అంటున్నారు .. మొత్తంగా చూస్తే బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ మూవీ ఏరియాలో పరంగా మాత్రం మేజర్ గా ఫెయిల్ అయింది అంటున్నారు ..


ఇక ఈ సినిమా నార్త్ ఇండియాలో బాగా ఆడుతుంది హిందీ మార్కెట్లో మాత్రం దుమ్ము రేపుతుంది. నాట్ మార్కెట్లో క‌ల‌క్ష‌న్లు ఈ మూవీ 1000 కోట్లు దాటింది .. అలాగే ఇప్పటివరకు ఉన్న బాలీవుడ్ సినిమాల రికార్డులు మొత్తం బ్రేక్ చేసింది. కానీ సౌత్ లో మాత్రం ఫెయిల్ అయింది. అలాగే అల్లు అర్జున్ కు భారీ అభిమానులు ఉన్న కేరళలోనూ ఈ సినిమా డిజాస్టర్ కావటం అందరికి షాక్ ఇస్తుంది. అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ లోను ఈ మూవీ నష్టాల్లోనే ఉందట .. బయ్యర్లకి డబ్బులు రావడం లేదట .. ఇంకా బ్రేక్ ఈవెన్ కూడా కాలేదని ట్రేడ్ వర్గాలు అంటున్నారు .. సీడెడ్‌లోనూ ఇదే పరిస్థితి. అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ కాలేదట. నైజం తెలంగాణలో మాత్రం సేఫ్ అయిందని అంటున్నారు. అదే విధంగా కర్ణాటకలోనూ ఈ మూవీ బాగానే కలెక్షన్లు తెచ్చుకుంది. అలాగే అడ్వాన్స్ ఇచ్చిన వారికి బ్రేక్ ఈవెన్‌ అయ్యాయని అంటున్నారు .. కానీ తమిళనాడులో మాత్రం ప్లాఫ్ అని అంటున్నారు. అక్కడ కూడా బయ్యర్లకి డబ్బులు రాలేదట. ఇలా ఈ నాలుగు ఏరియాల్లో ఈ సినిమా బయ్యర్ లని నష్టాల్లో పడేసింది. వీటితోపాటు నార్త్‌ అమెరికాలో కూడా ఈ మూవీకి డబ్బులు రాలేదని , కొన్న రేట్ ఇంకా బ్రేక్ ఈవెన్ కాలేదని అంటున్నారు. మొత్తంగా ఓవర్సీస్ లో హిట్ అయిన నార్త్ అమెరికాలో మాత్రం ఇంకా ఇబ్బంది పడుతూనే ఉందని అంటున్నారు.



కానీ మిగిలిన దేశాల్లో మాత్రం ఈ సినిమాకు బాగానే కలెక్షన్లు వచ్చాయి. బాలీవుడ్ లో ఈ సినిమాకి ఇంత కలెక్షన్ లు ఎందుకు వచ్చాయంటే పుష్పా2 పూర్తిగా పక్క మాస్ మూవీ .. అంతేకాకుండా రా అండ్ రస్టిక్ గా ఉంటుంది.. క్యారెక్టర్ బెస్ట్ ఫిలిం బీహార్ , చతిస్గడ్ , జార్ఖండ్ , ఉత్తరప్రదేశ్ , మధ్యప్రదేశ్ , మహారాష్ట్ర , పశ్చిమ బెంగాల్ వంటి ఏరియాలో ప్రేక్షకులు ఇలాంటి మాస్ క్యారెక్టర్  సినిమాలను బాగా ఇష్టపడతారు .. మొత్తంగా జన జీవన విధానం దీనికి దగ్గరగా ఉంటుంది. మాస్ ప్రేక్షకులు ఉన్న రాష్ట్రాలు ఇవి అందుకే ఈ సినిమాకి అంత క్రేజ్ వచ్చింది. అలాగే హిందీలో ఈ సినిమా పది రూపాయలకు వంద రూపాయలు చేయటం కూడా విశేషం. ఇక హిందీలో ఆటకపోతే ఇది బిగ్గెస్ట్ డిజాస్టర్ జాబితాలో చేరేది. కానీ అల్లు అర్జున్ , దర్శకుడు సుకుమార్ ఈ విషయాన్ని ముందే ఊహించారు .. ప్రధానంగా వారికోసమే వాళ్ళు కనెక్ట్ అయ్యాలనే యాక్షన్ ఎలిమెంట్లు తెరకెక్కించారు. అలాగే హీరో పాత్ర‌ని డిజైన్ చేశారు. ఇలా వారు అనుకున్న టార్గెట్ రీచ్ అయ్యారు .. అలా అక్కడ పుష్ప విలయతాండవం చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ తెలుగు ప్రేక్షకులకి సౌత్ ఆడియన్స్ కి మాత్రం కొద్దిగా ఎక్కలేదని అంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: